హోటళ్లలో ఓనర్ల పేర్లు ప్రదర్శించాలి: హిమాచల్ సర్కార్ కీలక నిర్ణయం

సిమ్లా: హిమాచల్‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఓనర్ పేరు, ఫోన్ నంబర్​తో పాటు అతడి అడ్రస్.. తప్పనిసరిగా కస్టమర్లకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిమ్లాలో జరిగిన రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

 కాగా, ఈ అంశంపై ఇటీవల స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా.. ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు విక్రమాదిత్య సింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు అనిరుధ్ సింగ్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు. కమిటీ భేటీ సందర్భంగా విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. హాకర్లకు ఐడీ కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ తరహా ఆదేశాలు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా జారీ చేసింది. 

హోటళ్ల యజమానులు, ఆపరేటర్లు, మేనేజర్ల పేర్లు కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.