- గెలిచిన డైరెక్టర్లను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ
- కాంగ్రెస్ లీడర్లపై పోలీసుల లాఠీచార్జి
- వాగ్వాదానికి దిగిన లీడర్లు
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల అర్బన్ ఎన్నికల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. గురువారం ఎన్నికలు ముగిశాక కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో డైరెక్టర్ గెలిచి బయటకు వస్తుండగానే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల లీడర్లు చైర్మన్ ఎన్నిక కోసం డైరెక్టర్లను తమ ప్యానెల్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్లపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ కొడుకు ప్రమోద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
గొడవకు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కారణమైతే తమపై లాఠీచార్జ్ చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులకు, కాంగ్రెస్ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబర్చేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ లీడర్లకు లాఠీలు తగిలాయని సీఐలు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్ సర్ది చెప్పారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయారు.