ఆర్మూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  ఆర్మూర్ మండలం సుర్పిర్యాల్ గ్రామస్థులు  పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.  సర్పంచ్ గ్రామ అభివృద్ధికి చెందిన రెండు ఫ్లాట్లను ఆక్రమించుకొని రూములను నిర్మాణం చేపట్టాడని ఆందోళనకు దిగారు.

 గ్రామస్థులు భారీగా పీఎస్ దగ్గరకు వచ్చారు.  పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.  అయితే  శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీఐ నచ్చ చెప్పిన గ్రామస్థులు వినలేదు. దీంతో  కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.