తృణధాన్యాలతో 45 అడుగుల రాఖీ.. ఎక్కడంటే?

రక్షాబంధన్ సందర్భంగా గుజరాత్ లో స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన భారీ రాఖీ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజ్ కోట్ లోని విరాని హైస్కూల్ విద్యార్థులు.. తృణధాన్యాలతో 45 అడుగుల  రాఖీని ఏర్పాటు చేశారు. స్కూల్ ఆవరణలో భారీ రాఖీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాఖీలో ఉపయోగించిన మిల్లెట్స్ ను బోల్బాలా ట్రస్ట్  కు ఇవ్వనున్నట్లు స్టూడెంట్స్ చెప్పారు.

స్కూల్ లోని 9వందల మంది విద్యార్థులు రెండ్రోజులపాటు భారీ రాఖీని సిద్ధం చేశారన్నారు ప్రిన్సిపాల్ హరేంద్రసింగ్ దోడియా. స్టూడెంట్స్ కేవలం తమ పాకెట్ మనీతోనే భారీరాఖీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీ కేర్ వీ షెర్ స్లోగన్ తో.. ప్రకృతిని కాపాడుకోవాలన్న విద్యార్థులు సందేశం ఆకట్టుకుంటోంది.