హైకోర్టులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణకు చుక్కెదురయ్యింది. 9వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన కుడుముల సత్యనారాయపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే మే 18న తనపై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన వెకెషన్ బెంచ్.. చట్టబద్ధంగా అవిశ్వాస తీర్మానం జరగాల్సిందేనని ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో మే18న ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరగనుంది.