గ్రామాల్లో బోర్లు వేయించిన హైకోర్టు లాయర్‌‌

లింగంపేట, వెలుగు :  వేసవిలో తాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు లింగంపేట గ్రామానికి చెందిన హైకోర్ట్‌‌ సీనియర్‌‌ లాయర్‌‌ మోహిన్‌‌ అహ్మద్‌‌ ఖాద్రీ పలు గ్రామాల్లో బోర్లను తవ్వించారు. మండలంలోని ముస్తాపూర్, ఐలాపూర్‌‌, రాంపల్లి, అన్నారెడ్డిపల్లి, కోమటిపల్లి, లింగంపేట గ్రామాల్లో నాలుగు రోజుల వ్యవధిలో 10 బోర్లను వేయించారు. 

సోమవారం ఐలాపూర్‌‌ గ్రామంలోని గంగమ్మగుడివద్ద, లింగంపేటలోని 5, 6, 9 వార్డుల్లో సొంత డబ్బులతో బోర్లు వేయించడంతో గ్రామస్తులు హర్షం చేస్తున్నారు. మోహిన్‌‌ అహ్మద్‌‌ ఖాద్రీని సత్కరించారు.