Kavya Thapar: అతను కమిట్మెంట్ ఇవ్వాలన్నాడు.. కావ్య థాపర్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్లో కావ్య థాపర్ అంటే పెద్దగా పరిచయం లేని పేరు. తన అందం, నటనతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటుంది ఈ పంజాబీ బ్యూటీ. 'ఈ మాయ పేరేమిటో' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది.ఇక రీసెంట్గా కావ్య నటించిన డబుల్ ఇస్మార్ట్, విశ్వం మూవీలతో మరోసారి తెలుగు ఆడియన్స్ను అలరించింది.

తాజాగా కావ్య థాపర్ తన కెరీర్ తొలిరోజులను గుర్తుచేసుకుంది. అందుకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఒక యాడ్లో అఫర్ ఉందంటే ఆడిషన్స్ ఇవ్వడానికి ఒకరి ఆఫీసుకు వెళ్లానని.. అలాగే నాలుగు యాడ్స్లో అవకాశం ఇస్తా అని చెప్పి.. అందుకు నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అతను అడిగినట్లు చెప్పుకొచ్చింది. దాంతో సీరియస్గా రియాక్ట్ అయ్యి.. అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేశానని తెలిపింది. 

ALSO READ |రూ. 50 లక్షలు ఇవ్వు.. లేదంటే చంపేస్తాం.. హీరోయిన్‌కు బెదిరింపులు

అంతేకాకుండా అతను అదే పనిగా రెట్టిస్తూ ఉండటంతో.. వెంటనే అక్కడి నుంచి వచ్చేశానని తొలి రోజులు వివరాలు వెల్లడించింది. అయితే, నన్ను నటిగా చూడాలన్నది నాన్న కల. అందుకే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నటనపై ఇంట్రెస్ట్ పెట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పతంజలి, మేక్ మై ట్రిప్ యాడ్స్ చేయగా.. వాటిని చూసి 'ఈ మాయ పేరేమిటో' సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు చెప్పుకొచ్చింది.