ట్రెక్‌‌ పార్క్‌‌లో నేచర్‌‌ క్యాంప్‌‌

హైదరాబాద్​కి దగ్గర్లో ట్రెక్కింగ్ లాంటివి ఉంటే బాగుండేది అనుకునేవాళ్లకు మంచిరేవుల బెస్ట్ ఆప్షన్. సిటీకి చాలా దగ్గరగా ఉన్న ఇక్కడ నేచర్‌‌ క్యాంప్‌‌లో ట్రెక్కింగ్‌‌, క్యాంప్ ఫైర్ ఉంటాయి. 

తెలంగాణ స్టేట్‌‌ ఫారెస్ట్‌‌ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో ఎకో టూరిజంని డెవలప్‌‌ చేస్తున్నారు. అందులో భాగంగానే మణికొండ మున్సిపల్‌‌ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్‌‌ ట్రెక్‌‌ పార్క్‌‌లో నేచర్‌‌ క్యాంప్స్​ ఏర్పాటు చేస్తున్నారు. క్యాంప్‌‌లో పాల్గొనే వాళ్లకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. చెక్‌‌ డ్యామ్‌‌ పాండ్‌‌ దగ్గర క్యాంపింగ్‌‌ సైట్ ఉంటుంది. అక్కడ టెంట్‌‌ ఎలా వేసుకోవాలో డెమో చూపిస్తారు. తర్వాత టెంట్‌‌ పిచింగ్‌‌ చేయిస్తారు. రాత్రి భోజనం చేశాక లాంతర్లు ఇచ్చి ట్రెక్కింగ్‌‌ చేయిస్తారు. తర్వాత క్యాంప్​ ఫైర్‌‌ ఏర్పాటు చేస్తారు. 

‘బర్డ్‌‌ వాక్‌‌’ ప్రోగ్రామ్​లో భాగంగా పక్షులను గుర్తు పట్టేందుకు వీలుగా వాటి బొమ్మలు, పేర్లు ఉన్న  బ్రోచర్స్ ఇస్తారు. ఈ క్యాంప్స్​లో పాల్గొనేందుకు 9493549399, 9346364583 నెంబర్లని కాంటాక్ట్​ చేయాలి.

ఎక్కువ ఖర్చేం కాదు

ఎకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రెక్​ పార్క్‌‌ ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి 30 రూపాయలు. ఇందులో వాకింగ్‌‌, జాగింగ్‌‌, యోగా లాంటివి చేయొచ్చు. ఒకవేళ ఒక ఏడాదిపాటు ఎంట్రీ మెంబర్​షిప్​ తీసుకుంటే.. ఒకరికి 2,400 రూపాయలు ఛార్జ్‌‌ చేస్తాన్నారు. భార్యాభర్తలిద్దరికీ కలిపి మెంబర్​షిప్​ తీసుకుంటే 3,600 రూపాయలు అవుతుంది. సీనియర్‌‌ సిటిజెన్స్​కు 1,500 రూపాయల ఫీజు. ఆన్‌‌లైన్‌‌ ద్వారా బుక్‌‌ చేసుకోవచ్చు కూడా. ఇప్పటి వరకు రెండు క్యాంప్‌‌లు ఏర్పాటుచేశారు. జనవరి 26వ తేదీన14 మందితో ఫస్ట్‌‌ క్యాంప్‌‌, ఫిబ్రవరి 5న 24 మందితో రెండో క్యాంప్‌‌ ఏర్పాటుచేశారు. 

మధుబాబు, గండిపేట్