డిసెంబర్ 31 వస్తుందంటే చాలు చాలామంది వారం ముందు నుంచే భారీగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ.. బడ్జెట్ పెద్దగా లేనివాళ్లు ఇంట్లోనే పెద్ద సౌండ్‌లో మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేసి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని బడ్జెట్ గాడ్జెట్స్ ఉన్నాయి..
ఫ్లాషింగ్ గాగుల్స్
పార్టీ అంటేనే చమక్కుమనిపించే ఫ్లాష్ లైట్లు. అందుకే న్యూ ఇయర్ పార్టీలో పెట్టుకునేందుకు ఈ లైటింగ్ గాగుల్ బెస్ట్ ఆప్షన్. వీటిని పీఈఎల్‌ఓ అనే కంపెనీ అమెజాన్‌లో అమ్ముతోంది. ఈ గాగుల్స్‌లో 6 ఫ్లాషింగ్ మల్టీ కలర్ ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా పెట్టుకోవచ్చు. -ఫ్లాషింగ్‌ను ఆన్/ఆఫ్ చేయడానికి, మోడ్స్ మార్చడానికి ఒక స్విచ్ కూడా ఉంటుంది. ఈ లైట్లు వెలగడానికి చాలా తక్కువ బరువు ఉన్న చిన్న బ్యాటరీలు ఇందులో ఉంటాయి.
ధర: 491 రూపాయలు
బబుల్ గన్
ఇది పిల్లలు ఆడుకునే బుడగల గన్. ఈ మధ్య పార్టీల్లో కూడా ఇలాంటివి వాడుతున్నారు. ఇందులో బబుల్ సొల్యూషన్‌ని పోసి ఆన్ చేస్తే నీటి బుడగలను వెదజల్లుతుంటుంది. దీన్ని విక్రిద అనే కంపెనీ సేల్ చేస్తోంది. ఈ బబుల్ మేకర్‌కు 69 రంధ్రాలు ఉంటాయి. వాటి నుంచి నిమిషానికి 2 వేల కంటే ఎక్కువ రంగుల బుడగలు బయటకు వస్తాయి. ఆ బుడగలకు ఎక్స్‌ట్రా కలర్ ఎఫెక్ట్ ఇచ్చేందుకు దీనికి మల్టీ కలర్ ఎల్‌ఈడీ లైట్లు నాలుగు ఉన్నాయి. రాత్రే కాదు పగలు కూడా ఈ లైట్లు చాలా బ్రైట్‌గా వెలుగుతాయి. ఈ గన్‌ని హై క్వాలిటీ ఏబీఎస్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇందులో రీ యూజబుల్ బ్యాటరీ ఉంటుంది. దీంతోపాటు వచ్చే యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నైట్ పార్టీలు, క్యాంపింగ్ ట్రిప్స్, బర్త్‌డే పార్టీలు, కార్నివాల్స్, ఎంగేజ్‌మెంట్లు, బేబీ షవర్లు.. ఇలా ఎక్కడైనా వాడుకోవచ్చు.
ధర : 999 రూపాయలు
బెలూన్ పంప్
బెలూన్స్ లేకుండా న్యూ ఇయర్ పార్టీ ఎలా జరుగుతుంది? అందుకే ఇల్లంతా బెలూన్స్‌తో నింపేస్తారు చాలామంది. కానీ.. వాటిలో గాలి నింపాలంటేనే విసుగొస్తుంది. అలాంటప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ బెలూన్ పంప్ వాడాలి. దీన్ని టాయ్ ఇమేజిన్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. దీనికి గాలి నింపే నాజిల్స్ రెండు ఉంటాయి. వాటికి బెలూన్స్‌ని తగిలించి మెషిన్ ఆన్ చేస్తే చాలు. క్షణాల్లో బెలూన్స్‌లో గాలిని నింపేస్తుంది. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ పంప్ రాగితో తయారుచేశారు. దీనిలో ఉండే పవర్‌ఫుల్ 600 వాట్స్ బ్లోయింగ్ ఇంజన్ కొన్ని సెకన్లలోనే బెలూన్‌లో గాలి నింపుతుంది. ల్యాటెక్స్, ఫాయిల్, డెకరేటివ్, లెటర్స్ బుడగల్లో గాలి నింపగలదు.
ధర : 649 రూపాయలు
గ్లో స్టిక్స్
పార్టీలో ఎవరైనా రంగురంగుల బ్రేస్‌లెట్స్, నెక్లెస్‌లతో డాన్స్ చేస్తే.. అందరి కళ్లు వాళ్ల మీదే ఉంటాయి. అలాంటివాటిని తయారు చేసుకునేందుకు ఈ గ్లో స్టిక్స్ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలా పార్టీల్లో వీటిని బ్రేస్‌లెట్, నెక్లెస్, హెడ్‌బ్యాండ్, రిస్ట్‌బ్యాండ్, గ్లాసెస్‌లా పెట్టుకుంటున్నారు. వీటిని ఎటాచ్ చేయడానికి విడిగా కనెక్టర్లు ఉంటాయి. ఒక్కో స్టిక్ ఎనిమిది -అంగుళాలు ఉంటుంది. ఒకసారి యాక్టివేట్ చేస్తే.. 10 నుంచి14 గంటల పాటు వెలుగుతాయి. ఇవి వాటర్ ఫ్రూఫ్. కాబట్టి రెయిన్ డాన్స్ చేసేటప్పుడు, పూల్ పార్టీల్లో కూడా వాడుకోవచ్చు.
ధర: 100 స్టిక్‌లకు 493 రూపాయలు