MAA Association: మా అసోసియేషన్ నుండి హేమ సస్పెండ్

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో టాలీవుడ్‌ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) సస్పెండ్ చేసింది. ఇదే విషయంపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ చేయగా.. సభ్యులంతా సమ్మతిస్తూ రిప్లయ్‌ ఇచ్చినట్లు సమాచారం. 

దాంతో.. మా నుండి హేమను సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంచు విష్ణు. ఇక బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో హేమకు క్లీన్‌ చిట్‌ వచ్చేవరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరు రేవ్‌ పార్టీలో హేమ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ముందు ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధంలేదని హేమ తెలిపారు. కానీ, వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ గా రిపోర్ట్ వచ్చింది. దీంతో..  ఇటీవలే ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.