ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద నీరు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు ఎగువనుంచి వరద పెరిగింది. హాజీపూర్ మండలం ఎల్లంపల్లి వద్ద ఉన్న ప్రాజెక్టుకు 8వేల 600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 12.797 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం  145.07 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నుంచి 331 క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు.