కార్తీకం మాసం తొలి సోమవారం .. వేములవాడకు పోటెత్తిన భక్తులు

  • కార్తీక మాసం.. రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
  • దర్శనానికి ఐదు గంటల టైం

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 5 గంటలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంట టైం పట్టింది. భారీగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామున నుండే తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు. ఆలయ ముందు భాగంలో ఉన్న రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. 

నవంబర్ 3న  ఆదివారం స్వామి వారిని 60 వేల 256 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు చెబుతున్నారు.