చాలా వ్యాధులకు కొలెస్ట్రాల్ ప్రధాన కారణం. ముఖ్యంగా గుండె జబ్బులకు. ప్రతి ఒక్కరికీ రోజుకు 20 గ్రాముల ఫ్యాట్ అవసరం. మనం నిత్యం ఉపయోగించే వంట నూనెల్లో ఇది లభిస్తుంది. అది శరీరానికి సరిపోతుంది కూడా. కాబట్టి ఇతరల్లో అదనంగా లభించే ఫ్యాట్ తగ్గించుకోవాలంటే..! ఎప్పుడూ ఒకే రకమైన వంట నూనెలు వాడకూడదు.
• సన్ ఫ్లవర్, రైస్ బ్రౌన్.. గ్రౌండ్ నట్ ఇలా నూనెల రకాలను మారుస్తూ ఉండాలి.
• వెల్లుల్లిలో ఐసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
• ఆలివ్ నూనెలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.
• వారంలో రెండు రోజులు చేపలు తినాలి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి బ్లడ్ క్లాట్స్ ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి. రోగనిరోధకశక్తి పెంచుతాయి.
• గోదుమల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ గోధుమల్లోనే కాకుండా ఓట్స్, బార్లీ, రాగి, జొన్నల్లో కూడా సమృద్ధిగా లభిస్తుంది.
• పాలు, పాల ఉత్పత్తుల్లో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఆవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.