హార్ట్ ప్రాబ్లమ్..ఆస్పత్రి బిల్డంగ్పై నుంచి దూకిన రోగి..స్పాట్లోనే చనిపోయాడు

హాస్పిటల్​బిల్డింగ్​పై నుంచి దూకి రోగి సూసైడ్​చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్​జిల్లాలో చోటుచేసుకుంది.  జీజీహెచ్ హాస్పిటల్ బిల్డింగ్ ఆరవ ఫ్లోర్ పై నుంచి  చాట్ల లక్ష్మణ్​(50) అనే వ్యక్తి దూకడంతో తీవ్రగాయాలతో స్పాట్​లోనే చనిపోయాడు.   

నాగారం ఏరియాకు చెందిన చాట్ల లక్ష్మణ్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య శకుంతల ఒక కొడుకు ఉన్నాడు.  కొంతకాలంగా హార్ట్ సమస్యతో  మానసిక కుంగుబాటు ఎదుర్కొంటున్నాడు. నాలుగు రోజుల కింద ఒంటివాపులు ఆయాసంతో  జీజీహెచ్ హాస్పిటల్ లో ఇన్ పేషెంట్ గా చేరాడు.  

ALSO READ | నిజామాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇవాళ పొద్దున్న తన బెడ్ నుంచి లేచి ఆరవ ఫ్లోర్ కు  వెళ్లి దూకేశాడు.  అక్కడున్న పేషంట్లు ఆపే ప్రయత్నం చేస్తున్నంత లోపు రెప్పపాటులో కిందకు దూకేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.