Good Health:ఇవి తిన్నా... తాగినా.. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్‌ రావు

హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది.చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. రక్తం చిక్కబడటం వాటిలో ఒకటి. అందుకే రక్తాన్ని పలుచబరిచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే హార్ట్ ఎటాక్, బ్రెయిన స్ట్రోక్స్ వంటి వ్యాధులు రాకుండా.. దూరంగా ఉండొచ్చు. మరి ఏయే ఆహార పదార్థాలతో రక్తం పలుచబడుతుందో తెలుసుకుందాం.

హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్‌కు ప్రధాన కారణం  రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం. అందువల్ల రక్తాన్ని పలుచపరిచే ఆహార పదార్థాలను బాగా తీసుకోవడం వల్ల.. మేలు జరుగుతుంది. ఇటీవల గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. శరీరంలో రక్తం చిక్కబడినా.. గడ్డకట్టినా.. అది ప్రాణాంతకం కావచ్చు. రక్తం చిక్కగా ఉంటే.. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకు రక్తాన్ని పలుచబడేందుకు మందులు వాడుతారు.  ఆహారంలో కొన్ని పదార్దాలు తీసుకోవడం వల్ల రక్తం పలుచబడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. 

అల్లం (Ginger): ఆయుర్వేదంలో అల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది జింజెరోల్స్ అనే సహజ శోథ నిరోధక సమ్మేళనాలుంటాయి. జింజెరోల్స్ వల్ల ప్లేట్లెట్ సమీకరణ తగ్గుతుంది. తద్వారా రక్తం పలుచబడుతుంది. రక్త ప్రసరణ ఆరోగ్యకరంగా ఉంటుంది.

పసుపు (Turmeric): భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వేసే పదార్థం పసుపు. ఇందులో కర్కుమిన్ అనే ముఖ్యమైన మూలకం ఉంటుంది. కర్కుమిన్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. దీనివల్ల రక్తంలో గడ్డలు ఏర్పడకుండా శరీరంలో రక్తప్రసరణ కూడా బాగుంటుంది. 

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు (Vitamin-c): విటమిన్ సి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష, కివి వంటి సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ పండ్లలో విటమిన్ సితో పాటు బయోఫ్లవనాయిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ శరీరంలోని కణాల గోడలను బలోపేతం చేస్తాయి. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. 



గ్రీన్ టీ (Green Tea): గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే కాటెచిన్ అనే మూలకం రక్తాన్ని పలుచగా చేసి అందులో గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది. రక్తాన్ని గడ్డకట్టించే ప్రధాన ప్రోటీన్లైన ఫైబ్రినోజెన్, థ్రాంబిన్లను కాటెచిన్స్ నిరోధిస్తాయి. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కణాలలో రక్త ప్రవాహం కూడా మెరుగుపడుతుంది