మీరు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. గుండెపోటు రావొచ్చు.. మెదడు డ్యామేజ్ కావొచ్చు..

మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా రాదని భావించి.. మూడు, నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారా.. మరీ ముఖ్యంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయితే మీకు ఓ హెల్త్ అలర్ట్.. మీకు గుండెపోటు రావొచ్చు.. మీ శరీరంలోని రక్తం గడ్డకట్టొచ్చు.. మీ మెదడు డ్యామేజ్ కావొచ్చు.. అవును.. ఇది పచ్చినిజం.. ఇది వాళ్లూ వీళ్లూ చెప్పింది కాదు.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీనే ప్రకటించింది. ఆ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్లను.. మన దేశంలోని ముంబైకి చెందిన సీరం కంపెనీలో ఉత్పత్తి చేశారు. అప్పట్లో కరోనా నుంచి మనుషులను కాపాడిన వ్యాక్సిన్లుగా జేజేలు పలికారు జనం.. ఆ విధంగా మన మోదీ సర్కార్ కూడా చెప్పింది.. ఇప్పుడు అంతా తారు మారు అయ్యింది..

కోవీషీల్డ్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని.. ఆస్ట్రాజెనెకా కంపెనీనే.. ఇంగ్లాండ్ లోని కోర్టులో స్వయంగా ఒప్పుకున్నది.. ఈ వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. అదే విధంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందని.. మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని.. ఆ వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా స్పష్టంగా ఒప్పుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లను కోట్ల మందికి వేయించాయి ప్రభుత్వాలు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే టార్గెట్స్ పెట్టి మరీ వేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొన్ని సందర్భాల్లో మరణాలు తీవ్ర గాయాలకు కారణమైందని ఆస్ట్రాజెనెకా UKలో క్లాస్-యాక్షన్ దావాను ఎదుర్కొంటున్నందున ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇద్దరు పిల్లల తండ్రి అయిన జామీ స్కాట్, రక్తం గడ్డకట్టడం వల్ల పని చేయలేక పోవడంతో చట్టపరమైన చర్య తీసుకున్నాడు. ఏప్రిల్ 2021లో వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత, తన మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం ఏర్పడిందని, దాని ఫలితంగా శాశ్వత మెదడు గాయం ఏర్పడిందని అతను పేర్కొన్నాడు. అతనికి వచ్చిన TTS అని వైద్యులు నిర్ధారించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ యొక్క భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తిన అనేక ఇతర వాటిలో స్కాట్ కేసు ఒకటి.

TTS (థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్) అంటే ఏమిటి?

థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) ఇది రక్తం గడ్డకట్టడం (థ్రాంబోసిస్) ప్లేట్‌లెట్ స్థాయిలలో తగ్గుదల (థ్రాంబోసైటోపెనియా) అని అంటారు. రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం ఏర్పడినప్పుడు, అది రక్తం యొక్క సాధారణ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది, ఇది వివిధ సమస్యలకు దారితీయవచ్చు. థ్రోంబోసైటోపెనియా, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడాన్ని సూచిస్తుంది. ఆస్ట్రాజెనెకా భారత ప్రభుత్వానికి వ్యాక్సిన్‌ను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది