బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. అందుకే ఈ కాలంలో పండ్లు, కూరగాయలతో తయారుచేసే సలాడ్స్ తినడం బెటర్. అలాంటి టేస్టీ, హెల్దీ సలాడ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
స్ట్రాబెర్రీ, గ్రేప్ సలాడ్
కావలసినవి
స్ట్రాబెర్రీలు : పది (సన్నగా తరిగినవి)
ద్రాక్ష: ఒక కప్పు
సపోటా ముక్కలు :- అరకప్పు
జామముక్కలు : అరకప్పు
నల్లద్రాక్షల రసం : ఒక టేబుల్ స్పూన్
గార్నిష్ చేయడానికి : మూడు టీ స్పూన క్రీమ్, చెర్రీలు నాలుగు
తయారీ
స్ట్రాబెర్రీ, జామ, సపోటా ద్రాక్షముక్కలను ఒక గిన్నెలో వేసి కలపాలి. తినాలను కున్నప్పుడు ఈ ముక్కల్లో ద్రాక్షరసం వేసి పైన క్రీమ్, చెర్రీలతో గార్నిష్ చేయాలి. ముందుగా క్రీమ్ వేసి దాని మీద ద్రాక్ష రసం వేసినా బాగుంటుంది. పిల్లలు క్రీమ్ ఇష్టంగా తింటారు కాబట్టి కాస్త ఎక్కువ క్రీమ్ వేసి మధ్యలో చెర్రీ పెట్టి దాని చుట్టూ ద్రాక్షరసం రకరణాలబొమ్మలు షేప్ వచ్చేటట్లు వేస్తే ఇష్టంగా తింటారు.
కీరకర్బూలజాతో
కావలసినవి
కీరదోసకాయ ముక్కలు : రెండు కప్పులు
టొమాటో ముక్కలు : రెండు కప్పులు
ఉల్లిపాయ : ఒకటి (ముక్క కోసి)
కర్బూజా ముక్కలు : రెండు కప్పులు
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : మూడు టీ స్పూన్లు
వెనిగర్ కొద్దిగా
తయారీ
కీరదోసకాయ, టొమాటో,కర్బూజా, ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. తర్వాత అందులో ఉప్పు మిరియాలపొడి వేసి మరోసారి కలపాలి. అంతే సలాడ్ రెడీ! ఈ సలాడ్ని వెంటనే తినొచ్చు లేదంటే కా సేపు ఫ్రిజ్ లో పెట్టుకుని అయినా తినొచ్చు.
మిక్స్డ్ ఫ్రూట్స్ తో
కావలసినవి
బొప్పాయి పండు ముక్కలు : అర కప్పు
యాపిల్ ముక్కలు : అర కప్పు
నల్ల ద్రాక్ష: అరకప్పు
దానిమ్మగింజలు : అర కప్పు
అరటిపండు : ఒకటి
పుచ్చకాయ ముక్కలు : అరకప్పు
వెనిల్లా ఐస్క్రీం : పావుకిలో
తయారీ
పండ్ల ముక్కల్ని చిన్న సైజులో తరిగి, ఒక గిన్నెలో వేసి అరగంట ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత వెనిల్లా ఐస్క్రీంని వాటిపైన వేసుకుని, కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
వాటర్ మిలన్ సలాడ్
కావలసినవి
పుచ్చకాయ ముక్కలు : ఒక కప్పు
కర్భూజముక్కులు : అరకప్పు
పుదీన : రెండు రెమ్మలు
పెరుగు : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : చిటికెడు
తయారీ
ఒక గిన్నెలో పుచ్చకాయ, కర్బూజ ముక్కలు వేసి అందులో పుదీనా ఆకులు, పెరుగు, ఉప్పు కూడా కలపాలి. అంతే! వాటర్ మిలన్ సలాడ్ రెడీ. సాధారణం గా పుచ్చకాయ తినేటప్పుడు, సలాడ్ కోసం ముక్కలు కోసినప్పుడు గింజలు వదిలేస్తుంటారు. నిజానికి గింజలలో అనేక ఔషధగుణాలుంటాయి. కాబట్టి గింజలను కూడా ముక్కలతోపాటు తినాలి