Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్​ పెట్టొచ్చు... 

సహజంగా చింతకాయలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లోఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చింతగింజల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కావున చింత గింజలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. కావున ప్రతిరోజు చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Also Read:ఇంట్లోనే క్యాలీఫ్లవర్ వెరైటీ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు.. హోటల్ టేస్టీ

ఎండాకాలంలో గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసిన చింతపండు, చింతగింజల కుప్పలే దర్శనమిస్తుంటాయి. చింత‌పండును స‌హ‌జంగానే మ‌న ఇళ్లలో రోజూ ఉప‌యోగిస్తుంటారు. చారు, పులుసు, పులిహోర వంటి వాటిల్లో చింత‌పండును ఖచ్చితంగా వాడుతుంటారు. అయితే చింత పండే కాదు, చింతపండు గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలారకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజ‌ల‌తో ప‌లు అనారోగ్య స‌మ‌స్యల‌ను న‌యం చేసుకోవచ్చు.

  • చింత గింజల్లో పొటాషియం అధికంగా అధికంగా ఉంటుంది కావున ప్రతిరోజు చింత గింజల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
  • చింత గింజ‌ల పొడి డికాష‌న్‌ను తాగ‌డం వ‌ల్ల హైబీపీ సైతం త‌గ్గుతుంది. ఈ గింజ‌ల్లో ఉండే పొటాషియం బీపీని త‌గ్గిస్తుంది. చింత గింజ‌ల్లో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ గింజ‌ల పొడిలో నీళ్లు క‌లిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. ఇలా చేస్తుంటే అవి త్వర‌గా మానుతాయి. 
  • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింత గింజ‌ల‌ పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు క‌లిపి పేస్ట్‌లా చేయాలి. దాంతో రోజూ దంతాల‌ను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాల‌పై ఉండే గార‌, పాచి సైతం మాయ‌మ‌వుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • చింత గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.
  • మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారికి చింత గింజ‌లు అద్భుత‌మైన వ‌రం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం చింతల గింజల పొడిని నీళ్లలో కలిపి మ‌రిగించి డికాష‌న్‌ను తయారు చేసుకోవాలి. ఈ డికాషన్‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు క‌ప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. 
  • చింత గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థని మెరుగు పరుచుకోవడానికి సహాయ పడటమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే చింత‌గింజ‌ల‌ను పొడి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో క‌లిపి తాగితే అజీర్ణం త‌గ్గుతుంది.
  • చర్మంపై మంగు మచ్చలు ఇతర సమస్యలతో బాధపడేవారు చింత గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చింత గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉంటే.. మీ చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.
  • చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో క‌లిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. నాలుగు వారాల్లో మోకాళ్ల నొప్పులు పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోకాలి నొప్పులతో బాధపడే వారు ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు
  •  చింత గింజల పొడిని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించుకోవచ్చు.

చింత గింజల పొడిని ఎలాయతయారు చేయాలంటే..

 నాణ్యమైన చింత గింజలను సేకరించి దోరగా వేయించి మెత్తటి పొడితయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోని ప్రతిరోజు పాలు లేదా నీటిలో అర టీ స్పూన్ చింత గింజల పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.