నెగెటివ్ క్యాలరీలతో బరువు తగ్గొచ్చు

తినడం తగ్గించేకన్నా.. డైట్ లో ఉండాల్సిన పర్టిక్యులర్ ఫుడ్ మెయింటెయిన్ చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చు, డైట్ లో నెగెటివ్ క్యాలరీ ఫుడ్ ఉంటే సులభంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. డైటింగ్ లో ఉండే చాలామంది ఈ ఫుడ్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సాధారణంగా తిన్నది జీర్ణం అయి క్యాలరీల రూపంలో ఎనర్జీ వస్తుంది. కానీ నెగెటివ్ క్యాలరీ ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీల కన్నా.. అది జీర్ణం అవడానికి అవసరమయ్యే క్యాలరీలే ఎక్కువ. పైగా ఈ ఫుడ్ ద్వారా విటమిన్లు, మినరల్స్ అందుతాయి. 

నెగెటివ్ క్యాలరీలో ఉండే ఫుడ్స్, వాటి ఉపయోగాలు..

బెర్రీస్ : బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇవి వివిధ రకాల క్యాన్సర్ల నుంచి కాపాడతాయి. అరకప్పు బెర్రీస్ లో  కేవలం 32 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీంట్లో ఉండే ప్రొటీన్ వల్ల బెర్రీలను నెగెటివ్ క్యాలరీ ఫుడ్ అంటారు.

టొమాటో : వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్ -సి ఎక్కువ. టొమాటో స్కిన్ క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. వంద గ్రాముల టొమాటోలో 19 క్యాలరీలు ఉంటాయి. అందుకే వీటిని డైట్ లో చేర్చాలి.

దోసకాయ: వంద గ్రాముల దోసకాయలో 15 క్యాలరీలు ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, మినరల్స్ అందించడంతో పాటు దాహాన్ని తీరుస్తుంది. ఇది డైటరీ ఫైబర్ ను అందిస్తుంది. పేగుల రోగాల నుంచి, డయాబెటీస్ నుంచి కాపాడుతుంది. 

పుచ్చకాయ: వంద గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు ఉంటాయి. పుచ్చకాయ గింజలు రక్తహీనతను నివారిస్తాయి. ఇందులోని సి, బి6 విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.