Good Health : ఇవి తిన్నా.. ఇవి తాగినా కూడా బరువు ఇట్టే తగ్గిపోతారు

‘తక్కువ పని చేస్తూనే.. ఎక్కువ ఫలితం పొందాలి'.. చాలా మంది మైండ్స్ దీనికే అలవాటు పడ్డయ్. దీనికే స్మార్ట్ వర్క్ అని పేరు పెట్టి కొత్త కొత్త పద్ధతులు కనుగొంటున్నారు. ఇదే ఎక్సర్ సైజ్ కి, హెల్త్ కి కూడా వర్తిస్తుంది. 'అబ్బ వెయిట్ తగ్గాలంటే రోజూ గన్ని కిలోమీటర్లు ఉరకాల్నా? 'అని చాలా మంది గొణుక్కుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే తక్కువ ఎఫర్ట్స్ తో బరువు తగ్గేలా, ఆరోగ్యంగా ఉండేలా కొత్త టిప్స్ కనుగొన్నరు కొంతమంది ఫిట్నెస్ నిపుణులు. 'తిన్న క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చెయ్యాలి'అని అందరికి తెలిసిన సూత్రాన్ని దీనికి అప్లై చేసినరు.

రెండు పనులు ఒకేసారి

యాక్టివ్ గా ఉండాలంటే ఎక్సర్ సైజ్ చెయ్యాలి. కానీ మీరు టీవీ చూస్తూ బిజీగా ఉంటారు. చెయ్యాలని తెలిసినా.. బద్ధకంతో చెయ్యలేరు. అందుకే

  • టీవీ చూస్తూనే కొన్ని పుషప్స్ చేయండి
  • బ్రష్ చేస్తున్నప్పుడు కొన్ని గుంజీలు తీయండి. 
  • లంచ్, డిన్నర్ తర్వాత కనీసం ఓ ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పాటలు వింటూ నడవండి.

మంచి మసాల దినుసులు

 

  • మన జీవక్రియకు తోడ్పడే లవంగం, దాల్చిన చెక్క, పసుపు, ఎర్ర మిరియాలు, అల్లం వంటి పదార్థాలు రోజూ మీ డైట్ లో ఉండే విధంగా చూసుకోండి.
  • లవంగం, దాల్చిన చెక్క రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి.
  • అల్లం చర్మకాంతికి దోహదం చెయ్యటంతో పాటు ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడా నికి ఉపయోగపడుతుంది.
  • ఎర్ర మిరియాలు రక్త నాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి.
  • పసుపు పిత్తాశయ పనితీరుని మెరుగుపరుస్తుంది. 

చల్లని నీళ్లు తాగండి

నీళ్ల రుచి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. చల్లని నీళ్లు తాగటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేని వారు చల్లని నీళ్లు తాగితే మంచిది. చల్లని నీళ్లు తాగటం వల్ల శరీరంలోని కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. ఈ పని చెయ్యటం అంత కష్టమైనదేం కాదు. ఒక గ్లాసు చల్లని నీళ్లు తాగితే 10 నుంచి 15 క్యాలరీలు ఖర్చ వుతాయి. బరువు తగ్గటానికి చల్లని ఆహారం తీసుకోవడాన్ని ఐస్ డైట్ అని కూడా అంటారు. చల్లని ఆహారం తీసుకోవడం వల్ల శరీరం వేడె క్కడానికి కొన్ని క్యాలరీలను ఖర్చు చేస్తుంది. 

కొంచెం నడుస్తూ

 ఇది చాలా ఈజీ పని. లంచ్ తర్వాత కొద్దిసేపు అలా ఎండలో నడవండి. ఇలా రోజూ చెయ్యటం వల్ల రక్త నాళాల పనితీరు మెరుగవ్వడమే కాకుండా.. మీ శరీరంలో వస్తున్న మార్పుని తక్కువ సమయంలోనే గుర్తుపడతారు.

కళ్లని మోసం చెయ్యండి 

తక్కువ పదార్థాలు ఎక్కువ సేపు తినడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇది మీ కళ్లని.. పొట్టని మోసం చెయ్యటం ద్వారానే .. సాధ్యమవుతుంది. మీ పదార్థాలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. వాటిని చిన్న ప్లేట్ల లో పెట్టుకుని తినండి.

 వీటిని మర్చిపోండి 

కొన్ని ఆహార పదార్థాలను విడిచిపెడితేనే మీ శరీ రానికి పట్టిన ఫ్యాటీ వదులుతుంది. ఇందుకు మీరు కొన్ని పదార్థాలను శాశ్వతంగా మర్చిపోతే మంచిది. 'ఒక్క సారి ఊహించుకోండి... మీరు చాక్లెట్ ని తినడం మానెయ్యగలరా?”, చాక్లెట్ ను తొందరగా మర్చిపోవడం కష్టమే. అందుకే కొంచెం కొంచెం తినడం తగ్గిస్తూ వెళ్లండి. అలాగే స్వీట్స్ ని కూడా. శరీరానికి రోజుకు 500 క్యాలరీలు అవసరం. దీంతో పాటు వారానికి ఒక రోజు జీర్ణాశయానికి ప్లేట్ రెస్ట్ కావాలని న్యూట్రి షన్స్ అంటున్నారు. దీనికి తగ్గట్టుగా డైట్ ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

తక్కువ క్యాలరీలు 

యాపిల్స్ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. భోజనానికి 15 నిమిషాల ముందు యాపిల్స్ తినడం వల్ల తక్కువ తింటారు. దీని వల్ల రోజు మొత్తంలో మీరు తీసుకునే ఆహారంలో దాదాపు 200 క్యాలరీల వరకు తగ్గుతాయి.