Good Health: బ్లాక్ బెర్రీస్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. డైట్ లో కొన్ని రకాల ఫుడ్స్ ని యాడ్ చేసుకుంటే చాలా వరకూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నేచర్ ఇచ్చిన అలాంటి సూపర్ ఫుడ్స్ లో బ్లాక్ బెర్రీస్ ఒకటి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. బ్లాక్ బెర్రీస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి:

బ్లాక్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ అధికంగా ఉండటంవల్ల ఒత్తిడిని తట్టుకొనే శక్తిని ఇస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటివి రాకుండా కాపాడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

బ్లాక్ బెర్రీస్ లో పుష్కలంగా లభించే విటమిన్ C వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఇన్ఫెక్షన్స్, నీరసం రాకుండా కాపాడే తెల్ల రక్తకణాలను పెంపొందించడంలో కూడా విటమిన్ C కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని మన డైట్ లో చేర్చటం ద్వారా ఫ్లూ సీజన్లో జలుబు, దగ్గు వంటి సీజనల్ డిసీజెస్ కి దూరంగా ఉండచ్చు.

చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది:

బ్లాక్ బెర్రీస్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకొని చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. వీటిలో ఉండే విటమిన్ C చర్మాన్ని ధృడంగా ఉంచుతుంది. బ్లాక్ బెర్రీస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాల వల్ల మొటిమలు ఎక్జిమా వంటివి రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. 

బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది:

బ్లాక్ బెర్రీస్ లో పుష్కలంగా లభించే విటమిన్ K బోన్ హెల్త్ ని పెంపొందించడంలో తోడ్పడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బోన్స్ ని ఫ్రాక్చర్స్ కాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా లేటు వయసులో ఎముకలు ధృడంగా ఉండేదుకు దోహద పడుతుంది.

బ్రెయిన్ హెల్ల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది:

బ్లాక్ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎల్జిమర్స్ వంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంపొందించేందుకు కూడా తోడ్పడుతుంది.