Good Health: వర్షాకాలం: నేరేడుపండు.. దివ్య ఔషధం

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నేరెడు పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా ల‌భించే పండ్లలో నేరేడు పండు ఒక‌టి. ఎన్నో ఔష‌ధ గుణాలున్న ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  కానీ వాటిని తినే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. వీటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు వదిలిపెట్టరు. నేరేడు ఆరోగ్యానికి అంత గొప్ప దివ్య ఔషధమని నిపుణులు చెబుతుంటారు. నేరేడు పండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

 నలుపు, ఊదా రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ కనిపించే నేరేడు పండ్ల గురించి అందరికీ తెలుసు. కానీ వాటిని తినే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. వీటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు వదిలిపెట్టరు. నేరేడు ఆరోగ్యానికి అంత గొప్ప దివ్య ఔషధమని నిపుణులు చెబుతుంటారు. 

  • వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధాలు. ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా ఇవి పనిచేస్తాయి. అందుకే నేరేడు పండ్లు ఎక్కువగా దొరికే రోజుల్లో వీటిని అస్సలు మిస్సవ్వద్దు. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
  • హైబీపీతో బాధ‌ప‌డే వారికి నేరేడు గింజ‌లు మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తాయి. నేరేడు గింజ‌ల‌ను పొడిగా చేసి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీని కంట్రోల్ చేస్తుంది.
  • నేరేడు పండ్లు చూడటానికి చక్కని రంగుతో మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అంతే స్థాయిలో ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు
  •  నేరేడు పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఫైటోకెమికల్స్, ఫినాలిక్ ఆమ్లంతో పాటు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
  •  వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
  • అతిసారం, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని నేరేడు పండ్లు తినడం వల్ల కాపాడుకోవచ్చు.
  • దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు రాకుండా చేస్తాయి. 
  •  క్రమం తప్పకుండా తింటే కోరింత దగ్గు, బీపీ వంటివి తగ్గుతాయి.
  • నేరేడు పండ్లును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను కూడా ఇవి తగ్గిస్తాయి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిలో ఉండే పీచు పదార్థం, రక్తంలో చక్కెర స్థాయిలను తొందరగా పెరగకుండా నియంత్రిస్తుంది. వారంలో ఒకటి నుంచి రెండు సార్లు తక్కువ మోతాదులో నేరేడు పండ్లు తీసుకోవడం మంచిది.
  • అల్సర్‌, వాపులు వంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డేవారికి నేరేడు గింజ‌ల పొడి మంచి ఔష‌ధంలా ప‌ని చేస్తాయి. దీంతో జీర్ణవ్యవ‌స్థ మెరుగుప‌డుతుంది.
  •  షుగ‌ర్ పేషెంట్స్ నేరేడు గింజ‌ల‌తో శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఇందులో ఉండే.. జాంబోలైన్‌, జంబోసైన్ స‌మ్మేళ‌నాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
  •  నేరేడు గింజ‌లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్లు, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి.
  • నేరేడు గింజ‌ల‌ను పొడిగా చేసి నేరుగా తీసుకోవ‌చ్చు లేదా ఆహారంపై చ‌ల్లి తినొచ్చు.
  • నేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి చిరుతిండ్లుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా నేరేడు పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
  • కిడ్నీలో రాళ్లను తొలగిస్తాయి.  కడుపులో పేరుకుపోయిన చెత్తను తొలగించే లక్షణం నేరేడు పండ్లకు ఉంటుంది.
  • పొట్టలో వెంట్రుకలు ఉంటే వాటిని తొలగించే గుణం నేరేడుపండులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.