Good Health: అరగంట వాకింగ్​... ఆరోగ్యానికి శ్రీరామరక్ష

మనిషి ప్రయాణం నడకతోనే ప్రారంభమైంది. చెట్లు, పుట్టలు, అడవులు దాటుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఎన్నో కనుగొన్నాడు. కానీ.. ఆరోగ్యానికి నడకే కారణం అనే విషయాన్ని మరిచిపోయి.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. రోజులో అరగంట నడకకు కేటాయిస్తే.. ఆసుపత్రిలో రోజులకు రోజులు గడపాల్సిన అవసరం రాదంటున్నారు నిపుణులు. 

ఎన్ని కిలో మీటర్ల ప్రయాణమూనా ఒక్క  అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇంతకే ఆ ప్రయాణం ఎక్కడికి? విజయం కోసమా? సంపాదన కోసమా? దేని కోసం నడిచినా- ఆరోగ్యంగా ఉన్నంత వరకే ఆప్రయాణం సాగుతుంది. ఒక్కసారి ఆరోగ్యం చెడిపోతే అంతే సంగతులు. అందుకే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.బాడీషెడ్​ కు వెళ్లకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే ప్రతిరోజూ అరగంట నడిస్తే చాలు మీరు ఆరో గ్యంగా ఉంటారు అంటున్నది ఇంటర్నేషనల్ హెల్త్ జర్నల్. అరగంట నడక వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాలేంటో చెప్తూ ఓ నివేదిక విడుదల చేశారు.

ఏ వయసు వారైనా...  సులభంగా చేయగలిగే వర్కవుట్​ కేవలం నడక మాత్రమే. మిగతా ఏ పర్కవుట్ అయినా.. కాస్తో కూస్తో శరీర బలం. కూడా ఉండాలి. అందుకే.. డాక్టర్లు రోజూ.. కనీసం అరగంట నడవమని సిఫారస్​  చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా అరగంట నడిస్తే ఆ నడక ఆరోగ్యానికి శ్రీరామరక్షలా నిలుస్తుంది..

మెదడు అలర్ట్ అవుతుంది...

నడక మన శరీర భాగాలను ఉత్తేజపరుస్తుంది. దీంతో మెదడు ఆలర్ట్ అయి... ఎందార్ఫిన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏ మునిషైనా ఒత్తిడి ఉంటే  ఏ పనీ సరిగ్గా చేయలేదు. అలాంటిది నడక వల్ల ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతత, చురుకుదనం వస్తాయి. దీంతో అల్జీమర్స్. డిమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవు. 

కంటిచూపు మెరుగు...

అవును.. నడక వల్ల కంటిచూపు మెరుగవు తుంది. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సైంటిఫిక్ గా  ఎన్నోసార్లు రుజువైంది. కంటిచూపు మీద దాడి చేసే గ్లకోమా విడుదల కాకుండా నడక అడ్డుకుంటుంది. దీంతో కంటి మీద ఒత్తిడి తగ్గిపోయి కంటి చూపు బాగుపడుతుంది

గుండె మరింత దృఢంగా..

ఒక్క సెకన్ కూడా విరామం తీసుకోకుండా మన కోసం పనిచేసే అవయవమే గుండె. అలాంటి గుండె ఆరోగ్యం కోసం రోజులో కనీసం ముప్పై నిమిషాలు కేటాయించలేమా? ప్రతిరోజూ అరగంట సేపు నడిస్తే రక్తసరఫరా మెరుగవు తుంది. రక్తంలోని చెడు కొవ్వు తొలగిపోతుంది. బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ కరుగు తుంది. ఫలితంగా గుండెజబ్బులు దరిచేరవు. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో కాదు. అమెరికా హార్ట్ అసోసియేషన్ వారు పరిశోధనలు చేసి మరీ తేల్పారు.

ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది..

నడవడం పల్ల శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు గాలి పీల్చుకుంటాం. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు విడుదలవుతాయి. ఎక్కువగాలి పీల్పు కోవడం వల్ల ఊపిరితిత్తులు అలర్ట్ అయి చురుగ్గా పనిచేస్తాయి. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగై, లంగ్స్ సమస్యలు రావు.

షుగర్ కంట్రోల్ అవుతుంది..

శరీరంలో గ్లూకోజ్ సమతుల్యం కోల్పోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఈ రోజుల్లో పదిమందిలో నలుగురు షుగర్ సమస్యతో బాధపడుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. డయాబెటిస్ తో  సతమత మవుతూ.. డాక్టర్ల చుట్టూ తిరిగే కంటే, రోజూ ఓ అరగంట పాటు నడిస్తే రక్తంలో చక్కెన స్థాయిలు సమంగా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగవుతుంది...

నడిచినప్పుడు శరీరం యాక్టివ్ అవుతుంది.. ఫలితంగా అన్ని శరీర భాగాలు పనిచేస్తాయి. అందులో జీర్ణ వ్యవస్థ కూడా ఒకటి. నడుస్తున్నప్పుడు పేగుల్లో కదలికలు చురుగ్గా ఉంటాయి. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పేగు క్యాన్సర్, మలబద్దకం లాంటి రోగాలు రాకుండా నిరోధించవచ్చు.

కండరాలు యాక్టివ్ అవుతాయి..

శరీరం కష్టపడుతున్నప్పుడే. కండరాలు యాక్టివ్ అవుతాయి. కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా శరీరం బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. రోజులో కనీసం అరగంట నడిస్తే మీ శరీరం మీద ఎలాంటి ఆరోగ్య సమస్య దాడి చేయలే దంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ 30 నిమిషాలు నడిస్తే కీళ్ల, ఎముకల నొప్పులు తగ్గు తాయి. కీళ్లు బలంగా మారతాయి. గాయాలు తగ్గుతాయి. ఎముకలు పెళుసుబారవు.

నడుమునొప్పికి చెక్..

ఈరోజుల్లో చాలామందిని వేధించే సమస్య నడుమునొప్పి, ఎక్కువసేపు ఒకేచోట కూర్చొని చేసే ఉద్యోగాల పల్ల చాలామంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు. రోజులో ముప్పై నిమిషాలు వీడిస్తే నడుమునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

మ్యూజిక్ వింటూ..

సంగీతం మనిషి మూడ్​ని మార్చడంలో అన్నింటికంటే ముందుంటుంది. వాకింగ్ చేసేటప్పుడు సంగీతం వింటూ నడిస్తే.. మీలో ఉత్సాహం రెట్టింపవుతుంది. మరో పదినిమిషాలు ఎక్కువ సడిదేలా మ్యూజిక్ శక్తినిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.

జంటగా విడిస్తే..

ఒంటరిగా నడవడం ఇష్టం లేకపోతే ఫ్రెండ్... మీ జీవిత భాగస్వామినో వాకింగ్ పార్ట్నర్ గా తీసుకెళ్లండి. జంటగా వడిస్తే. మనసు తేలికపడుతుంది. రిలాక్సేషన్ లభిస్తుంది. కొన్నిరోజుల తర్వాత నడక అలవాటైపోతుంది. దీంతో, బాడీ, మైండ్ చురుకుగా ఉంటాయి.

-వెలుగు, లైఫ్​–