Good Health : ఉదయం ఎండ తగలకపోతే.. షుగర్ వస్తుంది.. D విటమిన్ ఔషధం..!

ఒంటిమీద పడే ఎండకు ఆరోగ్యానికి మధ్య ఉండే సంబంధం పెద్ద సబ్జెక్ట్ . ఒక్క మాటలో చెప్పాలంటే ఎండలేనిది ఆరోగ్యం లేదు. పొద్దున... మాపటిపూట ఎండ ఒంటి మీద పడ్డప్పుడు  శరీరం డి- విటమిన్ తయారు చేసుకుంటది. ఆ ఎండతో ఇదొక్కటే మేలనుకుంటున్నారు.  కాని ఇంకా చాలా ఉన్నయ్.   ఈ డి- విటమిన్ పెరిగితే శరీరం క్యాల్షియం, ఫాస్ఫరస్​ లను ఆహారం నుంచి మంచిగా పీల్చుకుంటది. క్యాల్షియంతో ఎముకలు గట్టిపడతాయ్. ఒంట్లో రక్తం తయారయింది. క్యాల్షియం శరీర జీవక్రియల్ని నియంత్రించే హార్మోన్​ ల తయారీకి ఉపయోగపడతది.

చక్కెరకు ఔషధం..

కణ నిర్మాణంలోని వివిధ భాగాల తయారీలో క్యాల్షియం పాత్ర ఉంటుంది. క్యాల్షియం లోపిస్తే కణాల నిర్మాణం, పొందికలో తేడా వస్తుంది. మన శరీర కణాలు ఇన్సులిన్ తీసుకుని గ్లూకోజ్​ని శక్తిగా మార్చుతయేయ్​. ఆ  ఇన్సులిన్ బాగుంటేనే మనం ఎనర్జిటిక్​ గా ఉంటం. పాంక్రియాస్​ లో  ఇన్సులిన్ స్రవించే కణాలు తయారు కావాలంటే క్యాల్షియం ఉండాల్సిందే. క్యాల్షియం తగ్గిందో ఇన్సులిన్ తగ్గినట్టే అది తగ్గితే ఏమయితదో తెలుసు కదా? ఇన్సులిన్​  అందదు. శక్తి సరిపోక చక్కరొచ్చి పడిపోతం. ఇదే డయాబెటిస్ అంటే...  టైప్–2 డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పొద్దున లేకపోతే పొద్దుగూకేటప్పుడు ఓ అరగంటన్న ఎండలో ఉండాలె. ఇప్పటికే షుగరు ఉన్నోళ్లయితే ఇది. తప్పకుండ పాటించాలె.

పొద్దుటి ఎండతో ఎంతో మేలు

ఊళ్లలో కూలి సమయాల్లో మార్పులొచ్చినయ్. ఊళ్లలో ఒకప్పుడు కొంతమంది పాలేర్లు పొద్దుటి పనులకు పోయేటోళ్లు, కొంతమంది వాకిళ్లు ఊడ్చి కళ్లాపి చల్లేటోళ్లు ..పట్టణాల్లో కూడా వాకిలి ఉడేళ్లు .  పట్టణాల్లో అపార్ట్​మెంట్లు  వచ్చి ఆ పని పోయింది.

పల్లెటూళ్లలోకి టీవీలు వచ్చినంక లేటుగా పడుకుని లేటుగా చేస్తున్నరు. శరీరానికి కావాల్సిన డి-విటమిన్ అందిందే పొద్దుట ఎండని మిస్సయిన తర్వాత అవసరం లేని ఎండలో పనులు చేస్తున్నరు. పొద్దున, మాపటిపూట పనులు చేయకుండా పదింటికి వ్యవసాయ పనులు మొదలు పెట్టి నాలుగింటికి ముగిస్తున్నరు. కూలీలు పొద్దునే లేచి కూలికి పోవడం మానుకున్నరు. ఆడవాళ్లు ఇల్లెల్లకుండ బతకడం రాయల్​గా పీలయితున్నరు. ఇదో జబ్బని మాత్రం తెలుసుకుంటే మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు ఉంటే కిడ్నీలకు.. చర్మానికి నష్టం తప్ప లాభం లేదు. పొద్దున లేకపోతే మాపటి ఎండలో ఓ గంట ఉన్నదంటే ఈ సమస్య ఎన్నటికీ రాదు

ఎండ లేకుంటే.. ఎంత తిన్నా వేస్టే 

ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం, పాస్పరస్ తగినంత ఉండాలే. డి- విటమిన్ సరిపోయేంత లేకుంటే పేగులు క్యాల్షాయాన్ని పీల్చుకోవు. క్యాల్షియం లోపం అనగానే ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు క్యాల్షియం ఎక్కువ ఉంటే ఫుడ్ తీసుకుంటున్నడు. ఎముకలు బలపడేందుకు పిండం ఎదుగుదల కోసం గర్భవతులు, పిల్లల పెరుగుదల కోసం పాలిచ్చే తల్లులు క్యాల్షియం మాత్రలు తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం ఎంత తిన్నా ప్రయోజనం ఉండదు. వాటిని తీసుకుంటూ పొద్దుటి ఎండలో నడిస్తేనే ప్రయోజనం ఉంటది.

Also Read : మన దేశంలోనే.. ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ లేదు

డి విటమిన్​ లోపిస్తే ఆ తర్వాత 

క్యాల్షియం లోపం వస్తుంది. క్యాల్షియం లోపం మూలంగ ఎముకలు పెళుసుగ మారుతాయి. స్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వస్తుంది. క్యాల్షియం అయాన్లు రక్తంలో కావాల్సినంత ఉంటే రక్తం గడ్డకట్టే స్వభావం, కండరాల కదలికలు కూడా మంచిగ ఉంటాయి.


–వెలుగు,లైఫ్​–