ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు టైంపాస్ కోసం పల్లీలు.. ఉడకబెట్టిన వేరుశెనగలు కొని తింటుంటాం. ఏదో పని లేదు కదా అని తింటే అవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. వేరుశనగ గింజల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుందాం. .
పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం చాలా మంది రుచికరమైన వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతారు. వేరుశనగ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ,B విటమిన్లు , విటమిన్ E వంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ వేరుశెనగ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు కలగటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వేరుశెనగలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉడికించిన వేరుశెనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేరుశెనగల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక రకాలుగా పనిచేస్తాయి. వేరుశెనగలను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. వంటల్లో వేరుశెనగలను ఉపయోగించడం వల్ల అద్భుతమైన రుచి ఇస్తుంది. ఇడ్లీ, వడ, దోశలో వేరుశెనగలతో చేసే పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడుతారు. అయితే వీటిల్లోనే కాకుండా చాలా రకాల పచ్చళ్లు, వంటకాల్లోను వేరు శెనగలు కీలక పాత్ర పోషిస్తాయి.ముఖ్యంగా డయాబెటీస్ తో బాధపడే వారికి ఉడికించిన వేరుశెనగలు ప్రయోజనాలు ఇస్తాయి. ఉడికించిన వేరుశెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇవి సహాయపడతాయి. అందువల్ల ఎటువంటి భయం లేకుండా డయాబెటీస్ పెషెంట్స్ ఉడింకించిన వేరుశెనగలను ఆహారంగా తీసుకోవచ్చు.
జ్ఞాపక శక్తి :వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే విటమిన్ ఈ కారణంగా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
ఊబకాయం :ఉడకబెట్టిన వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. దీంతో కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉండి బరువు తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతాయి.
కొలెస్ట్రాల్‌ను నియంత్రణ: వేరుశెనగల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయి.
కంటి చూపును మెరుగుపరచటానికి : కళ్ళు బలహీనంగా మారకుండా ఉండాలంటే వేరుశెనగ గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఇందులో ఉండే జింక్ శరీరం విటమిన్ ఎను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రేచీకటి రాకుండా చేయటంలో సహాయపడుతుంది.
ఎముకలను దృఢంగా మారాలంటే: ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే, వేరుశెనగ గింజలను తీసుకోవాలి. వీటిలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల, వేరుశెనగ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
శాఖాహారం ప్రోటీన్ కు మంచి మూలం : శాఖాహారులు ప్రోటీన్ పొందాలనుకుంటే వేరుశనగ గింజలు మంచి ఎంపిక. ఒక పిడికెడు వేరుశెనగలో 7.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది : వేరుశెనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డిప్రెషన్‌ను తగ్గించడంలో : ఇటీవలి కాలంలో మానసిక సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వేరుశెనగ తినడం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా వేరుశెనగలను ఉడకబెట్టి తినడం అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందులోను పచ్చి వేరుశెనగలను ఉడకబెట్టి తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, హృద్రోగ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మధుమేహంతో బాధపడే వారికి ఇవి చాలా ఉపశమనం కలిగిస్తాయట. అందువల్ల వేయించుకుని తినే వేరుశెనగల కంటే ఉడకబెట్టుకుని తినే వేరుశెనగల్లో కెలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.