చల్లని బీర్ తాగితే ​.. చక్కని ఆరోగ్యం..అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా..

మనలో చాలా మంది బీరు తాగడం గురించి భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు.కొందరు బీరు తాగే వ్యక్తులపై ఏకంగా తాగుబోతులనే ముద్ర వేస్తూ ఉంటారు.అయితే బీరు తాగడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఎక్కువ మోతాదులో బీరు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టమే అయినప్పటికీ తగిన మోతాదులో బీరును తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. .అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్లని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్నవారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్పవు, బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది, ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు, కాని ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసిన, క్రికెట్ మ్యాచ్ ఉన్న, పండగలకి చుట్టాలు వచ్చిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా బీరు పొంగాల్సిందే అన్నట్టుగా మారిపోయింది కాలం. ఫ్రెండుకు జాబొచ్చినా.. గర్ల్ ఫ్రెండ్ హ్యాండిచ్చినా.. ఇంటికి సుట్టమొచ్చినా.. రాకరాక వానొచ్చినా.. మస్తు..ఖుషీగా ఓపెన్ చేసేది బీర్ బాటిలే. అవును.. బాధైనా, సంతోషమైనా, వేడుకైనా, వేదనైనా బీర్తో షేర్ చేసుకోవడం మనోళ్లకు బాగా అలవాటైపోయింది. అయితే.. బీర్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నాయి కొన్ని స్టడీలు. బావొచ్చినా, బంధువొచ్చినా ఆఖరికి బాధొచ్చినా బీర్ తో వెల్ కమ్ చెప్తారు. చాలామంది. ఇంటికొచ్చిన చుట్టానికి బీర్ తో మర్యాద చేయకపోతే అదొక నామోషీ అని ఫీలవుతుంటారు. 

మద్యసానం ఆరోగ్యానికి హానికరం .. థియేటర్లో సినిమా స్టార్టవడానికి ముందు ఈ యాడ్, ముఖేష్ యాడ్ ఉండాల్సిందే. కానీ.. మనోళ్లు అవన్నీ పట్టించుకుంటరా?  ఇంటర్వెల్ కాంగనే... బయటికి పోయి ఓ దమ్ము గుంజి వస్తారు.. సినిమా అయిపోయి ఇంటికి వెళ్లేటప్పుడు మధ్యలో వైన్​ షాపునకు వెళ్లి చల్లటి బీరు తాగి ..  ఇంటికి వెళ్లిన తరువాత తల్లో.. పెళ్లామో అరుస్తారని అంతో.. ఇంతో తిని గుర్రుపెడుతారు. 

బీర్​ తాగితే పొట్ట రాదు..

బీర్ ప్రేమికులందరికీ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ఓ వార్త మోసుకొచ్చింది. బీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ విషయం ఆ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలిందట.  బీర్ తాగితే.. పొట్ట పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అందుకే.. చాలాసార్లు బీర్ తాగాలని ఉన్నా.. పొట్ట వస్తుందేమో అని భయపడి ఇంకో మార్గం చూసుకుంటారు. అయితే..   బీర్ తాగితే పొట్ట రాదని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ  చేసిన పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు తెలిపారు. బీరులో   యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఆ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయట. శరీరంలో క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఎంజైములతో బీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైట్ చేసి వాటిని నాశనం చేస్తాయట. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. 

మెరుగైన కంటి చూపు కోసం బీర్ ​తాగితే....

 గట్టిగా రెండు బీర్లు తాగితే... కళ్లు తిరుగుతాయి.  భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని స్కూల్లో చదువుకున్న సోషల్ లెసన్ కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ ముచ్చట పక్కకు పెడితే.. బీరు తాగడం వల్ల వయసు మీద పడిన తర్వాత వచ్చే దృష్టిలోపం సమస్య రాదట. కెనడాలో చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది.  ప్రతిరోజూ ఓ గ్లాస్ బీర్ తాగితే.. కంటిచూపు మెరుగవుతుందట. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు యాక్టివ్ గా పనిచేస్తాయట. అంతేకాదు  బీర్ తాగినప్పుడు ఒత్తిడంతా పోతుందట. ఆ సమయంలో బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులోకి వస్తుందట. ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు.. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు హైబీపీతో  బాధపడుతున్న కొంతమందికి బీర్​ తాగించి వారు చేసిన అధ్యయనంలో తేలింది.

బీర్​ తాగితే గుండెపోటు రాదంట....

మనిషి పదికాలాల పాటు చల్లగా,ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగుండాలి. దాని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా... అంతే సంగతులు. బ్రిటీష్ మెడికల్‌ జర్నల్‌ పబ్లిష్‌ చేసిన ఓ ఆర్టికల్‌‌లో బీర్‌ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందని తేల్చారు. ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేయడమేనట. లండన్ యూనివర్సిటీ వాళ్లు చేసిన అధ్యయనంలో ... బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందనేది అబద్దం అని తేలింది. కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే... ఇందులోని ఫ్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయట. 

బీర్​ తాగితే కిడ్నీలో రాళ్లు మాయం

శరీరానికి ఎంత ఫైబర్ అందితే.. బాడీఅంత దృఢంగా అవుతుంది. జీవక్రియలు అంత సక్రమంగా జరుగుతాయి. ఈవిషయం ఏ డాక్టరును అడిగినా చెప్తారు. అందుకే.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నఆహారం తీసుకొమ్మని సలహా ఇస్తుంటారు.అయితే.. బీర్లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ బీర్లో 20శాతం ఉంటుంది. ఇక  కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారికి డాక్టర్లు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగమని చెప్తారు. దొరికితే కలుషితం కాని స్వచ్ఛమైన కల్లు తాగమని చెప్తారు.  కల్లు దొరికితే ఓకే. కానీ... పట్నంలో నాణ్యమైన కల్లు దొరకదు కాబట్టి  కిడ్నీల్లో రాళ్లతో బాధపడే వారికి అప్పుడప్పుడు
 బీరు తాగమని  సలహా ఇస్తారు.ఎందుకంటే బీర్లో రాళ్లు కరిగించే గుణాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం బీరులో పుష్కలంగాఉండి, కిడ్నీలో రాళ్లు కరిగించడానికిసహాయపడతాయి.

బీర్​ లో బీ విటమిన్​..

ఆరోగ్యంగా ఉండండి..రన్ అవుట్ కాకండి' అంటూ సిగరెట్ యాడ్లో రాహుల్ ద్రావిడ్ చెప్పేమాటలు గుర్తున్నాయా....  బీ- విటమిన్ తక్కువై ఆరోగ్యం విషయంలో కూడా రన్ అవుట్ కావొద్దంటే రోజుకో గ్లాసుబీర్ తాగమని చెప్తున్నారు పరిశోధకులు. బీర్​ లో  బి- విటమిన్​ కంటెంట్​  పుష్కలంగాఉంటుంది. కణాల ఆరోగ్యాన్ని బి- విటమిన్లు పెంచుతాయి.  ఆరోగ్యానికి మాత్రమే కాదు..అందానికి కూడా బీర్ చాలా ఉపయోగపడుతుంది. వెంట్రుకల ఆరోగ్యం కోసం, పటుత్వం కోసం రకరకాల షాంపూలు, నూనెలు, ప్యాక్లు వాడి అలసిపోయారా? అయితే.. ఈ సారి బీర్ తో మీ జుట్టు కడిగిచూడండి. తేడామీరే గమనిస్తారు. అల్రెడీ మార్కెట్లో బీర్ షాంపూలు దొరుకుతున్నాయి కదా...

డ‌యాబెటిస్‌...

బీర్లలో ఉండే ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వర్డ్​ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్రకారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్లను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్లలో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంద‌ట‌.ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్దాలు ఉండవు, మోతాదు మించితేనే అనారోగ్యం పాలు కావాల్సివస్తుంది, కాని బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది,

ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అదే పనిగా ఎక్కువ మోతాదులో బీర్లు తాగితే హార్ట్ సమస్యలతో పాటు, కిడ్నీ సమస్యలు వచ్చే ఆవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు, సూపర్ స్టార్ రజినికాంత్ చెప్పిన్నట్టుగా భోజనం అయిన.. బీరు అయిన మితంగా తీసుకుంటేనే ఔషదం....  అమితంగా తీసుకుంటే విషం అని గుర్తుపెట్టుకోండి.