Health Alert : హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటి కావు.. వీటిని ఇలా గుర్తించాలి..!

అలనాటి అందాల తార శ్రీదేవి.. మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్... ఇలా చాలామంది గుండె పోటుతో కన్నుమూశారు. అయితే కార్డియాక్ అరెస్ట్' కారణంగా వాళ్లు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దాంతో కొందరు కార్డియాక్ అరెస్ట్ అని.. ఇంకొందరు హార్ట్ ఎటాక్ అని... ఆ కారణాన్ని మార్చిమార్చి చెప్తున్నారు. ఈ రెండూ ఒకటే అనుకుంటున్నారు అంతా. కానీ, ఈ రెండూ గుండెకి సంబంధించినవే అయినా... చాలా తేడా ఉంది.
  
అప్పటివరకూ ఆరోగ్యంగా, నవ్వుతూ మాట్లాడుతున్న మనిషి... ఐదు నిమిషాల్లోనే చనిపోవడం చూస్తుంటాం. కారణమేంటని అడిగితే గుండె పోటు' అని చెప్పుంటారు.  రెండు సార్లు గుండె పోటు వచ్చినా తట్టుకోగలరు. ఇలా రోజూ మన చుట్టూ రకరకాల సంఘటనలు జరుగుతాయి. ఈ గజిబిజిలో చాలామందికి కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ కి తేడా తెలియట్లేదు. అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఉన్న తేడా ఏంటి? వాటి లక్షణాలేంటి. అసలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం.

> హార్ట్ ఎటాక్ అంటే...
కరోనరీ ధమనులు (కరోనరీ ఆర్టెరీస్)లో బ్లాకులు ఏర్పడినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె కండరానికి (కార్డియాక్ మజిల్) రక్త ప్రసరణ చేసే రక్తనాళాలనే కరోనరీ ధమనులు అంటారు. అలా బ్లాకులు ఏర్పడినప్పుడు గుండెకు ఆక్సిజన్ నిండిన రక్తం అందదు. ఆ బ్లాకులు త్వరగా తెరుచుకోకపోతే. మనిషి చనిపోతాడు.

> లక్షణాలు..
హార్ట్ ఎటాక్ వస్తే... ఛాతి పట్టేసినట్టు అనిపించి నొప్పి వస్తుంది. అలాగే ఛాతిలో ఒత్తిడి పెరిగి, పిండేసినట్టూ ఉంటుంది. వీటితో పాటు ఎడమ భుజం, దవడ... ఇలా ఎడమ పైభాగాలన్నింట్లోనూ నొప్పి మొదలవుతుంది.

> ఎందుకొస్తదంటే..
• గుండె కండరం దెబ్బ తినడం • మద్యపానం, ధూమపానం, పొగాకు, కెఫైన్ వంటివి తీసుకోవడం • గుండె చప్పుడులో తేడాలు ఉండటం

సీపీఆర్ అంటే.. 

 సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ప్రక్రియలో ముందుగా గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి.అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. బాధితుడి మెదడుకు 56 సెకండ్ల పాటు రక్తసరఫరా నిలిచిపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. అదే.. 40 సెకన్లు రక్త సరఫరా నిలిచిపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని గమనించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

> కార్డియాక్ అరెస్ట్ అంటే..
ఒక్కసారిగా గుండె.. రక్త సరఫరాను ఆపేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ అందదు. అప్పుడు మనిషి ఒక్కసారిగా కుప్పకూలి, ఊపిరాడక పోయి కోల్పోతాడు. గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కొందరు తరచూ కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 30 సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుచించుకుపోతాయి. అప్పటివరకూ రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయినా.. ఒత్తిడి వల్ల అవి కుచించుకుపోయి సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు కారణం. అవుతుంది.

ప్రమాద కారకాలు....
 ఎక్కువ బరువు లేదా ఒబెసిటీ సమస్య ఆ కుటుంబ నేపథ్యంలో గుండె సమస్యలు ఉండటం. హైబీపీ (అధిక రక్తపోటు) డయాబెటిస్ శారీరక శ్రమ లేకపోవడం. మారుతున్న లైఫ్ స్టయిల్,

> లక్షణాలు..
కార్డియాక్ అరెస్ట్ వస్తే.. గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఒక్కసారిగా ఉన్నచోటనే కుప్పకూలిపోతారు. శ్వాస ఆడదు. నాడి కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు సరైన ట్రీట్ మెంట్ అందకపోతే, మనిషి నిమిషాల్లోనే చనిపోతాడు. అయితే దీనికి ముందు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఛాతిలో కొద్దిగా నొప్పి రావడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. నీరసంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం వంటివి కనిపిస్తాయి.