Health News : భరించలేని తలనొప్పా.. ఓ 10 సెకన్లు ఇలా ట్రై చేయండి.

మారిన లైఫ్ స్టైల్, పెరిగిన ఒత్తిడి కారణంగా ఈరోజుల్లో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది.  కాఫీ, టీ, టాబ్లెట్స్, జండూ బామ్ వంటి వాటితో తాత్కాలిక ఉపశమనం పొందినప్పటికీ శాశ్వత పరిష్కారం అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తలనొప్పికి చాలా కాలం పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని టిప్స్ ఫాలో అయితే తలనొప్పిని టాబ్లెట్స్ వాడకుండానే తగ్గించుకోవచ్చు.  

ALSO READ | మూత్రపిండాలను శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచే 5 రకాల పండ్లు

  • తలనొప్పికి మన భావోద్వేగాలతో సంబంధం ఉంది. అందుకే.. తలనొప్పి మొదలవగానే ఆలోచించడం మానేసి శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే తక్షణమే ఉపశమనం పొందొచ్చు. 
  • శరీరానికి సరిపడా నీళ్లు అందకపోయినా కూడా తలనొప్పి మొదలవుతుంది. ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగితే తలనొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు.
  • కొన్ని ఐస్ ముక్కలను గుడ్డలో చుట్టి తలచుట్టూ ఆడిస్తే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. లేదంటే గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కున్నా కూడా తలనొప్పి తగ్గుతుంది. 
  • ఫోర్ హెడ్, కణతల మీద మృదువుగా మర్దన చేసినా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుంటే తలనొప్పి మటుమాయం అవుతుంది.
  •  తీవ్రమైన తలనొప్పి  చిటికెలో తగ్గాలంటే.. నిమ్మరసంలో అల్లం కలిపి తాగండి.
  •  పుదీన ఆకులను పేస్టులా చేసి.. సుదురు, మెడ మీద అప్లై చేస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  •  లవంగాల పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన పీలిస్తే.. తలనొప్పి చిటికెలో మాయమవుతుంది..
  • శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు... కూరల్లో పచ్చిమిర్చి వాడితే.. అందులోని పోషకాలు శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తాయి.
  • ఎర్ర ఉల్లిగడ్డను నలిపి పీలిస్తే... తలనొప్పి తగ్గిపోతుంది.
  • తలనొప్పి ఎక్కువుగా వస్తుంటే రోజుకు 8 నుంచి -10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. 
  • కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్​ ను   గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుంది. 
  • మెగ్నీషియం లోపంతో కూడా తలునొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నేషియం ఉన్న పోషక పదార్దాలు తీసుకోవాలి.
  • మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • గంధం చెక్కను అరగదీసి నుదిటి పై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
  • నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండానిద్రపోవాలి, దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి..
  • గ్లాస్ గోరు వెచ్చన పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే  జుకిత తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పడు అల్లం టీని తాగడం వల్ల ఇనిస్టెంట్ రిలీఫ్​ లభిస్తుంది..
  • రావిచెట్టు కాయలను మెత్తగా నూరి ఆగుజ్జను నుదిటిపై రాసినా తలనొప్పి తగ్గిపోతుంది.
  • నువ్వుల నూనెను రోజూ తలకు మర్ధన చేయటం వల్ల రక్త ప్రసరణ జరిగి నొప్పి తొలగిపోతుంది.
  • వెల్లుల్లిపాయలను నూరి కణతలకు పట్టులాగా వేయాలి. అలాగే ఖర్జూర గింజలు నీటితో నూరి రాయవచ్చు. దీని వల్ల తలనొప్పి పోతుంది.
  • కుంకుడు చెట్టు ఆకులను తలకు దట్టంగా కట్టినా తలనొప్పి తగ్గుతుంది.
  •  తలనొప్పి ఎక్కవగా ఉన్నప్పుడు దాల్చిన చెక్కను నీటితో నూరి కణతలకు రాస్తే తగ్గిపోతుంది.