కరీంనగర్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కరీంనగర్ లో   దారుణం జరిగింది.  విద్యానగర్ లోని తన నివాసంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సన్నిధి రవికుమార్(54) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆర్థిక ఇబ్బందులతోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. 

ఇల్లు కోసం చేసిన అప్పులు, చదువుకు  కావాల్సిన నగదు సర్దుబాటు విషయంలో  మనస్థాపానికి గురై ఇంటి కింది పోర్షన్లో ఉరి వేసుకున్నాడు రవికుమార్.  వెంటనే గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.