ట్రూడో ఓడిపోతడు.. ఎలాన్ మస్క్ జోస్యం

న్యూఢిల్లీ: కెనడాలో 2025లో జరిగే ఫెడరల్  ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని జస్టిన్  ట్రూడో ఓడిపోతారని టెస్లా సీఈఓ ఎలాన్  మస్క్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్  చేశారు. తమ దేశ ప్రధాని ట్రూడో తీరుతో విసిగిపోయామని, ఆయన నుంచి విముక్తి పొందడంలో సహాయం చేయాలని ఓ యూజర్  మస్క్ ను అడగగా ఆయన ఆవిధంగా జవాబు ఇచ్చారు. 

అయితే, జర్మనీ ప్రభుత్వంపై ఓ స్వీడిష్  జర్నలిస్టు స్పందిస్తూ ‘‘జర్మన్  సోషలిస్టు ప్రభుత్వం పడిపోయింది. త్వరలోనే ఎన్నికలు జరగవచ్చు” అని సోషల్  మీడియాలో పోస్టు చేశారు. దీనికి మస్క్  స్పందిస్తూ.. జర్మనీ చాన్సలర్  ఓలాఫ్‌‌  షోల్జ్ ను ‘ఫూల్’ గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తమ దేశంలో జరిగే ఫెడరల్  ఎన్నికలపైనా అభిప్రాయం చెప్పాలని ఓ కెనడా యూజర్.. మస్క్ ను అడిగాడు. ఫెడరల్  ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని మస్క్  అన్నారు. ట్రూడో మీద మస్క్  గతంలోనూ విమర్శలు చేశారు.