ఆకాశంలో అడ్వెంచర్: అతను గాల్లో తేలుతూ బైక్ డ్రైవ్ చేశాడు.. వీడియో వైరల్

అద్భుతం..మహాద్భుతం..స్కూటర్ పై రోడ్డుపై స్పీడ్ గా వెళ్లడమే ఓ అడ్వంచర్ అనుకుంటున్న వేళ.. ఆకాశంలో బైక్ పై డ్రైవింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒళ్లుగగుర్లు పొడిచే సాహసం విన్యాసాలు చేశాడు ఓ పారాగ్లైడర్. పంజాబ్ కు చెందిన హర్ష్ బిలాస్ పూర్ ఆకాశంలో స్కూటీతో పారాగ్లైడింగ్ చేశాడు. హర్ష్ భూమినుంచి 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో 6 నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనంపై ఆకాశంలో ఎగురుతూ చూసేవారిని థ్రిల్ చేశాడు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్, కెమెరాల్లో బంధించారు. పారాగ్లైడర్ అద్భుతమైన ఈ సాహస విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. చూద్దం పదండి..

ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బండ్లధర్ లో హర్ష్ బిలాస్ పూర్ అనే పారాగ్లైడర్ తన స్కూటీతో ఆకాశంలో సునాయాసంగా ప్రయాణిస్తు్న్న దృశ్యాలు కనిపిస్తాయి.ఇది చూసిన స్థానికులు ఈ వింత దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. 

 బైక్ పై ఇలా ఆకాశంలో పారాగ్లైడింగ్ ఇదే మొదటిసారి. హర్ష్ బిలాస్ పూర్ కంటే ముందు ఎవరూ ఇలా ప్రయాణించలేదట. పైలట్ సహకారంతో తాను విజయవంతంగా ఆకాశంలో స్కూటీపై ప్రయాణించగలిగానని  హార్ష్ బిలాస్ పూర్ చెపుతున్నాడు. బండ్లధర్ పర్యాటక ప్రాంతంలో ఇలాంటి సాహస విన్యాసం జరగడం కూడా ఇదే మొదటిసారి అంటున్నారు హర్ష్. 

బండ్లధార్ పర్యాటక ప్రాంతం, పారాగ్లైడింగ్ గురించి 

బండ్లధార్ ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆక్రో పారాగ్లైడింగ్ గమ్యస్థానాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోవింద సాగర్ రిజర్వాయర్  అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. 
పారాగ్లైడింగ్ అనేది థ్రిలింగ్అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇది గాలిలో తేలియాడేపారాచూట్ లాంటి రెక్కతో ఆకాశంలో ప్రయాణించేలా చేస్తుంది. పైలట్లు ఎత్తైన ప్రదేశాలనుంచి బయలు దేరుతారు. ఎత్తును పొందడానికి , ఆకాశాన్ని నావిగేట్ చేయడానికి పెరుగుతున్న గాలి ప్రవాహాన్ని వినియోగిస్తారు. పారాగ్లైడింగ్ లో ఉపయోగించే పరికరం బరువును బట్టి విన్యాసం ఉంటుంది. 

ఈ క్రీడ పాల్గొనే వారికి తప్పని శిక్షణ అవసరం.వాతావరణం అనుకూలంగా ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా అవసరం. పారాగ్లైడింగ్అనేది అడ్వెంచర్లను ఇష్టపడేవారికి అద్భుతమైన అనుభవాన్ని, అనుభూతిని కలిగిస్తుంది.