ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?

HDFC ఎర్గో  ఆరోగ్య సురక్ష ఆరోగ్య బీమా ప్లాన్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. ఈ ఆరోగ్య బీమా ప్లాన్‌ల కస్టమర్‌లు బీమా సంస్థ మరొక ప్లాన్‌కి తరలించ నుంది. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మైహెల్త్ సురక్ష హెల్త్ ఇన్సూరెన్స్ మూడు రకాలు ఉన్నాయి. మై హెల్త్ సురక్షా గోల్డ్, మైహెల్త్ సురక్ష ప్లాటినం, మై హెల్త్ సురక్షా సిల్వర్.. ఈ పాలసీలను HDFC నిలిపివేయనుంది. మూడు ప్లాన్‌లు అందించే ఆరోగ్య కవరేజీలు వాటి పునరుద్ధరణ తేదీ వరకు యాక్టివ్ గా ఉంటాయని HDFC ఎర్గో తెలిపింది. 

మైహెల్త్ సురక్ష బీమా పాలసీని ఆగస్టు 7, 2024న లేదా ఆ తర్వాత రెన్యువల్ గడువు ఉన్న కస్టమర్‌లు HDFC ఎర్గో ఆప్టిమా రిస్టోర్‌కి మారవచ్చని బీమా సంస్థ సూచించింది. Optima Restore కోసం రెన్యువల్ జరిగిన తర్వాత నిలిపివేయబడిన పాలసీలపై ఏదైనా బోనస్ వర్తింపజేయడం కొనసాగుతుంది. ఇంతేగాక పాలసీదారులు కొత్త ఆరోగ్య బీమా పాలసీకి మారినప్పుడు కొనసాగింపు ప్రయోజనాలను పొందుతారు.