ఇంటర్​తోనే సాఫ్ట్​వేర్​ జాబ్

  • బైపీసీ, సీఈసీ, ఒకేషనల్ స్టూడెంట్స్ కు చాన్స్ 
  • ఏడాది ట్రెయినింగ్ తర్వాత సాఫ్ట్​వేర్ ​జాబ్ 
  • ఇంటర్న్​షిప్​లో నెలకు రూ.10 వేల స్టైఫండ్
  • 27న మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్ ​కాలేజీలో జాబ్ ​మేళా
  • హెచ్​సీఎల్ టెక్​బీ, ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో సెలక్షన్స్​

మంచిర్యాల, వెలుగు: ఇంటర్మీడియట్​ క్వాలిఫికేషన్​తోనే యువతకు హెచ్​సీఎల్ ​టెక్నాలజీస్ సాఫ్ట్​వేర్​ జాబ్స్​కల్పి స్తోంది. ఇంటర్​లో 75 పర్సెంటేజీకి పైగా ​మార్కులు సాధించిన వారిని మెరిట్​ఆధారంగా సెలెక్ట్​ చేసుకుని, ఏడాది పాటు ట్రెయినింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఓవైపు జాబ్​ చేస్తూనే మరోవైపు ప్రముఖ యూనివర్సిటీల నుంచి డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తోంది.

ఈ మేరకు ఇంటర్ బోర్డు, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ మధ్య గతంలోనే ఎంవోయూ కుదిరింది. బీటెక్ ​చదవకుండానే సాఫ్ట్​వేర్ ​జాబ్ ​చేయాలనుకునే వారికి, ఆర్థిక ఇబ్బందులతో హయ్యర్​ స్టడీస్​ కొనసాగించలేని వారికి ఇది మంచి చాన్స్. ఉద్యోగంలో నైపుణ్యాలను బట్టి ప్రమోషన్స్​ లభించడంతో పాటు శాలరీ హైక్​ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్ ​బోర్డు, హెచ్​సీఎల్ ​టెక్​బీ ఆధ్వర్యంలో ఈ నెల 27న మంచిర్యాల గవర్నమెంట్​ జూనియర్​కాలేజీలో జాబ్ ​మేళా నిర్వహించనున్నారు.  

నాన్​ మ్యాథ్స్​ వారికి చాన్స్

2023, 2024 సంవత్సరాల్లో ఇంటర్ ​సీఈసీ, బైపీసీతో పాటు వొకేషనల్​ కోర్సుల్లో 75శాతం మార్కులు పొందినవారు జాబ్​ మేళాలో పాల్గొనవచ్చు. మూడు దశల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించి ఎంపిక చేస్తారు. 27న జరిగే జాబ్ ​మేళాలో రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారికి మొదట ఆప్టిట్యూడ్​ టెస్ట్, రెండో దశలో ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ టెస్టు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మెరిట్​ఆధారంగా మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్​ చేస్తారు.

వారికి మధురైలో మూడు నెలలు ట్రైనింగ్, ఆ తర్వాత తొమ్మిది నెలలు చెన్నైలో ఇంటర్న్​షిప్​ఉంటుంది. ఈ టైమ్​లో నెలకు రూ.10వేల స్టైఫండ్​అందించనున్నారు. ఈ రెండింటిని సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​చేసిన వారికి హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​లో ఏడాదికి రూ.2లక్షల ప్యాకేజీతో ఐటీ అసోసియేట్స్​గా​ జాబ్​ కల్పిస్తారు. 

జాబ్ ​చేస్తూనే చదువుకోవచ్చు..

అభ్యర్థులు హెచ్​సీఎల్ ​టెక్నాలజీస్​లో ఓవైపు సాఫ్ట్​వేర్​ జాబ్​ చేస్తూనే మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. ప్రతిష్టాత్మక బిట్స్​ పిలానీ, ఈఎంఐ నాగ్ పూర్, కేఎల్​ యూనివర్సిటీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ కొట్టాయం వంటి యూనివర్సిటీల్లో డిగ్రీ చేయవచ్చు. హయ్యర్​ స్టడీస్​ కోసం ఫీజుల్లో కొంతమొత్తాన్ని సంస్థ భరిస్తుంది. డిగ్రీ కంప్లీట్​అయిన తర్వాత అభ్యర్థులు రెండు సంవత్సరాలు తప్పనిసరిగా హెచ్​సీఎల్​లో జాబ్ ​చేయాలి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో కష్టపడితే హెచ్​సీఎల్​లోనే హయ్యర్​ పొజిషన్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.

యువత సద్వినియోగం చేసుకోవాలి

ఈ నెల 27న మంచిర్యాల గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలో జాబ్​మేళా నిర్వహిస్తున్నాం. 2023, 2024 విద్యాసంవత్సరాల్లో ఇంటర్​సీఈసీ, బైపీసీ, వొకేషనల్​ గ్రూప్స్​లో 75 పర్సెంట్​ మార్కులు సాధించినవారు అర్హులు. టెన్త్, ఇంటర్​ సర్టిఫికెట్లు, ఆధార్ ​కార్డు జిరాక్సులు, ఒక ఫొటో, ఆండ్రాయిడ్​ మొబైల్​తో జాబ్​ మేళాకు హాజరుకావాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - అంజయ్య, ఇన్​చార్జి డీఐఈవో, మంచిర్యాల

హయ్యర్​ పొజిషన్లకు చేరుకోవచ్చు 

హెచ్​సీఎల్ టెక్నాలజీస్​ సంస్థ ఇంటర్​క్వాలిఫికేషన్​తోనే సాఫ్ట్​వేర్ ​జాబ్స్ ​ఆఫర్ చేస్తోంది. ఓవైపు జాబ్​ చేస్తూనే మరోవైపు హయ్యర్ ​స్టడీస్ ​కంటిన్యూ చేయవచ్చు. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేల మందికిపైగా సెలెక్ట్ ​చేసుకున్నాం. ఎప్పటికప్పుడు స్కిల్స్​ డెవలప్ ​చేసుకుంటే హయ్యర్ ​పొజిషన్లకు చేరుకోవచ్చు.
- శ్రీనివాస్, హెచ్​సీఎల్​ టెక్​బీ హెచ్ఆర్