వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. మిస్ కావద్దు

పదికి పది రావాలె

కొత్తగూడ, వెలుగు: పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించి జిల్లాను రాష్ర్ట స్థాయిలో ఫస్ట్​ర్యాంక్​లో ఉంచాలని మహబూబాబాద్​డీఈవో రవీందర్​రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి జడ్పీ హైస్కూల్, గంగారం కస్తూర్బా గాంధీ స్కూళ్లను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం అందించాలని 
పేర్కొన్నారు. 

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం జయపురం ఆకెరు వాగు వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తహసీల్దార్  నాగరాజు చెప్పారు. మంగళవారం జయపురం ఆకెరు వద్ద ట్రెంచులను తొలగించి ఇసుక రవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను రెవెన్యూ ఆఫీసర్లు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు.

హెల్పర్ల సేవలు అభినందనీయం

తొర్రూరు, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న హెల్పర్ల సేవలు అభినందనీయమని తొర్రూరు ప్రాజెక్టు సీడీపీవో కమలాదేవి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ రైతు వేదికలో ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో ఇటీవల పదవి విరమణ పొందిన అంగన్​వాడీ హెల్పర్లకు మెమోంటోలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తనిఖీ 

తాడ్వాయి, వెలుగు: నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్స్ స్కీం కింద సెలెక్ట్ అయిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను మంగళవారం డీఎంహెచ్​వో గోపాల్​రావు సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. పనులు తొందరగా పూర్తిచేయాలని వైద్యాధికారి రణధీర్ కు 
సూచించారు.