నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఫోన్ వినియోగం తగ్గించాలి 

సూర్యాపేట, వెలుగు : విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇందుకోసం వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జడ్జి శ్రీవాణి సూచించారు. గురువారం సూర్యాపేటలోని జడ్పీ బాయ్స్ స్కూల్ లో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరమని, మైనర్లకు వెహికిల్స్ ఇవ్వొద్దన్నారు. హక్కులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లయ్య, హెచ్​ఎం గోలి పద్మ, లీగల్ ఎడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్ సత్యనారాయణ పిళ్లే, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. 

నల్గొండ టూ టౌన్ సీఐ మల్టీ జోన్–2 కు అటాచ్

నల్గొండ అర్బన్, వెలుగు : వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొటున్న నల్గొండ టూ టౌన్ సీఐ డానియేల్ కుమార్ ను వీఆర్ కు ఎటాచ్ చేస్తూ గురువారం ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 9న తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీంతో ఆమె కాపురానికి రావడం లేదని ప్రశాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ జరిపించి నివేదికను మల్టీ జోన్-–2 ఉన్నతాధికారులకు సమర్పించారు. అనంతరం సీఐ డానియల్ కుమార్ ను  మల్టీజోన్-–2 హైదరాబాద్ కు ఎటాచ్ చేశారు. 

కక్షతోనే కేసు 

యాదాద్రి, వెలుగు : కేటీఆర్​పై కక్షపూరితంగా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని బీఆర్ఎస్ స్టేట్ లీడర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్​మెంట్ కోసం ఈ- రేస్ నిర్వహించారని తెలిపారు. డెవలప్​మెంట్ కోసం పనిచేసినా కేసులు నమోదు చేసి భయపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు నమోదు చేస్తారా..? అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

మొగులయ్య మృతికి సంతాపం 

మఠంపల్లి, వెలుగు : జానపద కళాకారుడు మొగులయ్య మృతికి మండలానికి చెందిన పలువురు కళాకారులు గురువారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. జానపద పాటలలో తనదైన ముద్ర వేశారని, తెలంగాణ సంస్కృతిని తెలిపే పాటలు పాడారని గుర్తుచేశారు. 

బ్యాడ్మింటన్​లో విద్యార్థుల ప్రతిభ  

హుజూర్ నగర్, వెలుగు :  జిల్లా స్థాయిలో జరిగిన సీఎం కప్ బ్యాడ్మింటన్ డబుల్స్​లో గురువారం హుజూర్ నగర్ విద్యార్థి జక్కుల సుశాంత్ గౌతమ్, అభిరామ్ తో కలిసి గోల్డ్ మెడల్, సింగిల్స్ లో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సుశాంత్ గౌతమ్ ను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావు, కోచ్ లల్లుతోపాటు పలువురు అభినందించారు.