ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

అమిత్​ షాను బర్తరఫ్​ చేయాలి

భద్రాచలం, వెలుగు :  డాక్టర్​బాబా సాహెబ్​అంబేద్కర్​ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం- అల్లూరిసీతారామరాజు డివిజన్​ కమిటీ కార్యదర్శి ఆజాద్ ​గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మనువాదులు తమకు వ్యతిరేకులైన దళితులు, ఆదివాసీలు, మత మైనార్టీలు, కమ్యూనిస్టులు, మావోయిస్టులు లాంటి విప్లవ సంస్థలను 2047 కల్లా దేశంలో నిర్మూలించేందుకు కుట్ర చేస్తున్నారనడానికి ఈ ఘటనే సాక్ష్యం అని పేర్కొన్నారు. 

వంగవీటి మోహన రంగకు నివాళి 

అశ్వారావుపేట, వెలుగు: వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా గురువారం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పలువురు నాయకులు ఆయన విగ్రహానికి  పూలమాలవేసి నివాళులర్పించారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో రంగా తనదైన ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీను, పసుపులేటి నరేశ్, చిన్నంశెట్టి నాగేంద్రరావు, కొండయ్య, శివ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

రోడ్డుకు రిపేర్లు చేయాలని రాస్తారోకో 

కామేపల్లి, వెలుగు  :  పాత లింగాల క్రాస్ రోడ్డు నుంచి మర్రిగూడెం గ్రామ వరకు ధ్వంసమైన రోడ్డుకు రిపేర్లు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్వీవి రాకేశ్​మాట్లాడుతూ‌ జిల్లాలో ప్రధాన ప్రాంతాలకు పోయే రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే రిపేర్లు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ మండలం నాయకుడు చల్లా రాజు, స్థానికులు పాల్గొన్నారు.

బస్టాండ్ లో దొంగల హల్​చల్​

వైరా,వెలుగు :  వైరా  ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం జేబుదొంగలు హల్​చల్​ చేశారు. ముగ్గురు ప్రయాణికుల వద్ద బ్యాగులు కట్ చేసి రూ.60 వేల నగదు చోరీ చేశారు. వైరా బస్టాండ్ లో కొనిజర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన  అడపా రంగనాయకులు  ఖమ్మం వైపు వెళ్లే బస్సు ఎక్కుతుండగా అతను వద్ద ఉన్న రూ.54 వేల నగదు, వైరా మున్సిపాలిటీ లోని గండగలపాడుకు చెందిన ఇద్దరు మహిళలు జగ్గయ్యపేట  బస్సు ఎక్కుతుండగా వారి బ్యాగులు కట్ చేసి రూ.8 వేల విలువైన బంగారం,  నగదును  చోరీ చేశారు.

కిన్నెరసాని సందర్శించిన ఒరిస్సా అధికారి

పాల్వంచ, వెలుగు : మండలంలోని పర్యాటక కేంద్రమైన కిన్నెరసాని ఒరిస్సా రాష్ట్రం చెందిన కోరా ఫుట్ రీజినల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ప్రసన్నకుమార్ బెహరా గురువారం సందర్శించారు. బోటు షికారు చేశారు. జింకల పార్కు, అద్దాలమేడ తో పాటు పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక అట వీశాఖ అధికారులు సురేశ్, రాములు ఉన్నారు.