అయ్యో పాపం : వరదల్లో కారుతో సహా మునిగి HDFC బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మృతి

ఇద్దరు సహోద్యోగులు.. విధులు ముగించుకొని ఒకే కారులో ఇళ్లకు బయల్దేరారు..మరికన్ని నిమిషాల్లో ఎవరి ఇళ్లవాళ్లు వెళ్తారు అనుకునే సమయంలో.. అనుకోని ప్రమాదం వారిని బలిగొంది. భారీ వర్షాలు..ఎక్కడ చూసినా నీళ్లే.. హర్యానాను భారీ వర్షాలు ముంచెత్తుతున్న క్రమంలో  ఓ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎలాంటి హెచ్చరికలు లేని అండర్ పాస్ నీళ్లలో కారు మునిగి ఇద్దరు వ్యక్తులు జలసమాధి అయ్యారు. హర్యానాలోని ఓల్డ్ ఫరీదాబాద్ లోని రైల్వే అండర్ పాస బ్రిడ్జి కింద  కారు వర్షం నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. 

గురుగ్రామ్ హెచ్ డీఎఫ్ సీ బ్రాంచి మేనేజర్ పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేదీ శుక్రవారం ( సెప్టెంబర్ 13) విధులు  నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శర్మ, ద్వివేది కారులో వెళ్తుండగా.. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు రాగానే ఈ ఘటన జరిగింది. 

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైల్వే అండర్ పాస్ కింద భారీగా నీరు చేరింది. నీటి లోతు గురించి గమనించని ద్వివేది కనుచూపు మేరలో బారికేడ్లు లేకపోవడంతో దాని గుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు..  దురదృష్టవశాత్తు కారు నీటిలో మునిగిపోయింది. 

ఎన్ని సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కావడంతో శర్మ భార్య పోలీసులు సమాచారం అందించింది.  శర్మ, ద్వివేది కోసం గాలించిన పోలీసులు...ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్ పాస్ దగ్గరు కారును గుర్తించారు. కారులో శర్మ , ద్వివేది డెడ్ బాడీలను ఉన్నట్లు గుర్తించి బయటికి తీశారు. 

ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్ పాస్ వద్ద రక్షణగా ఎలాంటి బారీకేడ్లు లేకపోవడంతో వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.