హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఎగ్జిట్ పోల్స్ సహా.. దేశంలోని చాలా మంది ఊహించినట్లు అక్కడ రిజల్ట్స్ రాలేదు. కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడక అన్నట్లు భావిస్తే.. చివరికి ఫలితాలు మాత్రం బీజేపీ వైపు వచ్చాయి. హర్యానా ఎన్నికల్లోనే అందరి దృష్టి ఆకర్షించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్.. జులానా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ పై 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
వినేశ్ ఫొగట్ గెలుపు అంత ఈజీగా రాలేదు.. రౌండ్ రౌండ్ కు ఫలితం తారుమారు అవుతూ వచ్చింది. మొదటి మూడు రౌండ్లలో ఆధిక్యం సాధించిన వినేశ్ ఫొగట్.. ఆ తర్వాత ఐదు రౌండ్ల వరకు వెనకబడ్డారు. దీంతో ఆమె ఓడిపోతారనే ప్రచారం గట్టిగా వినిపించింది. చివరి ఐదు రౌండ్లలో మళ్లీ పుంజుకుని లీడ్ లోకి వచ్చారు. మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో.. వినేశ్ ఫొగట్ ఎట్టకేలకు గెలుపుతో బయటపడ్డారు.
Also Read : హర్యానా రిజల్ట్ తారుమారు
ప్రస్తుతం హర్యానాలో బీజేపీ 49, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ కీలక నేతలు హర్యానా రిజల్ట్ పై భేటీ అయ్యారు.