అక్టోబర్ 8న ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో సంబురాలు.. ట్రెండ్ మారిన తర్వాత.. బీజేపీ ఆఫీసుల్లో తీయని వేడుకలు.. రెండు గంటల్లో మారిపోయిన సీన్.. హర్యానా ఫలితాలు ఊహించలేదంటున్న కాంగ్రెస్.. బీజేపీలో సైతం ఇదే వాదన.
ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన వెంటనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే తర్వాత రౌండ్ రౌండ్ కి ఫలితం మారిపోయింది. ఊహించని రీతిలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. కాంగ్రెస్ ,బీజేపీ నువ్వానేనా అన్నట్లు ఆధిక్యంలో పోటీపడ్డాయి. మళ్లీ కాసేపటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటింది. కాంగ్రెస్ వెనుకంజలో పడిపోయింది. మళ్లీ సీన్ కట్ చేస్తే బీజేపీ పార్టీ ఆఫీసుల్లో సంబరాలు మొదలయ్యాయి.
Also Read :- హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ ఊహించని ఫలితాలపై అటు కాంగ్రెస్, బీజేపీ ఒక విధంగా షాక్ కు గురయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు రావడంతో బీజేపీ నేతలు ఓ విధంగా ఆశ్ఛర్యానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల అసలు గెలవలేమునుకున్న చోట్ల కూడా పార్టీ ఊహించని విజయం సాధించడంతో అవాక్కవుతున్నారు. ఇక గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ ఆధిక్యాన్ని ఊహించుకోలేకపోయింది.
ప్రస్తుతం హర్యానాలో బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాలు,ఇతరులు ఆరుస్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి