తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌ పై..బ్రూక్‌‌‌‌‌‌‌‌ ట్రిపుల్‌‌‌‌‌‌‌‌..రూట్ డబుల్‌‌‌‌‌‌‌‌

  •     ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 823/7 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌

ముల్తాన్‌‌‌‌‌‌‌‌ : పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గెలుపు దిశగా సాగుతోంది. హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (322 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 29 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 317), జో రూట్‌‌‌‌‌‌‌‌ (375 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 17 ఫోర్లతో 262) రికార్డులు బద్దలు కొట్టడంతో.. 492/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు గురువారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 150 ఓవర్లలో 823/7 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు 267 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. 

జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌ (31) ఫర్వాలేదనిపించాడు. నసీమ్‌‌‌‌‌‌‌‌ షా, సైమ్‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 37 ఓవర్లలో 152/6 స్కోరు చేసింది. సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఆగా (41 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), అమేర్‌‌‌‌‌‌‌‌ జమాల్‌‌‌‌‌‌‌‌ (27 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. సౌద్‌‌‌‌‌‌‌‌ షకీల్‌‌‌‌‌‌‌‌ (29), సైమ్‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌ (25)తో సహా మిగతా వారు ఫెయిలయ్యారు. అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌, కార్సీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌‌‌‌‌‌‌‌ ఇంకా 115 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది.