Happy Valentine's Day : ఈ రోజును ప్రేమకు ఇచ్చేయండి

మీ లైఫ్ లోని మోస్ట్ స్పెషల్ పర్సనికి మీ ప్రేమని వ్యక్తం చేసి ఎన్ని రోజులైంది? ఒకసారి గుర్తుచేసుకోండి. వాళ్లతో మీ ఫీలింగ్స్ ని చివరి సారిగా ఎప్పుడు చెప్పారు? వాళ్లతో మీకున్న మెమరీస్ ని వారానికోసారైనా రీ కలెక్ట్ చేసుకుంటున్నారా? ఆలోచిస్తే. చాలామంది ఆన్సర్ 'లేద'నే ఉంటుంది. అందుకే సంవత్సరానికోసారి ఫిబ్రవరిలో ప్రేమగాలి వీస్తుంటుంది. ఇది కేవలం కొత్తగా ప్రేమలో పడ్డ వాళ్లకి మాత్రమే కాదు. ప్రేమలో ఉన్నవాళ్లకు, భార్యాభర్తలకు కూడా..అందుకే ప్రేమవారంలో ఈ చివరి రోజున గుండె గది తలుపులు తెరవండి.. ఏమూలో గూడుకట్టుకున్న జ్ఞాపకాల్ని మరోసారి మనసారా హత్తుకోండి.

సంతోషాల్ని రెట్టింపు చేసేది... బాధను తగ్గించేది ఏదైనా ఉందా? అంటే అది ప్రేమ. అందుకే ప్రపంచంలో అందరూ ప్రేమను అంతగా ప్రేమిస్తారు. కానీ, ఎప్పుడైతే మన జీవితంలోకి అందమైన ప్రేమ వస్తుందో.. ఆ వెంటే కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. దానివల్ల కలిసి జీవిస్తున్నా ప్రేమని మర్చిపోతుంటారు. చాలామంది. కాదు... కాదు... ప్రేమని చెప్పడం మర్చిపోతుంటారు. దానివల్ల ప్రేమలోని అసలైన ఆనందాల్ని కోల్పోతారు. అందుకే ఈ వాలెంటైన్స్ డే రోజు మిగతావన్నీ మర్చిపోదాం. ప్రేమ ఒడిలోనే ఈ ఒక్కరోజూ మనసారా సేదతీరదాం. ఈ రోజుని మరింత అందంగా మార్చుకుందాం. అదెలాగంటే...

ఇదే బెస్ట్ వే..

సృష్టి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది. ఈ సృష్టి ఉన్నంత వరకు అది అలానే ఉంటుంది. అంతే స్వచ్ఛంగా.. అంతే నిస్వార్థంగా ఉంటుంది. దీన్ని మనసారా ఆస్వాదించాలంటే ఎదుటి వాళ్లపై ఉన్న ప్రేమని ఏదో రకంగా చెప్పాలి. అయితే ప్రేమని చెప్పేందుకు చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ, వాటిల్లో బెస్ట్ వే ఏంటంటే.. ఎంత ప్రేమిస్తున్నామో ప్రేమించిన వాళ్లకి చెప్పడమే. అది కూడా మాటల్లో. కాకపోతే ఈ సారి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. మన మనసులోని మాటలకి అక్షర రూపం ఇద్దాం. ఆ జ్ఞాపకాల్లో ఈ ప్రేమ రోజుని మరింత మెమరబుల్గా మార్చుకుందాం. 

ప్రేమ వెకేషన్ కి వెళ్లాం..

కొన్ని క్లాసు రూమ్ కథలు... మరికొన్ని క్యాంటిన్ కబుర్లు. పక్కింట్లోంచి వీచే ప్రేమ గాలులు ఇంకొన్ని. బస్సులు, రైళ్లు కూడా ప్రేమకి ప్లాట్ ఫాంలే.. ఇ .. ఇలా ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో చోట మొదలవుతుంది. ఆ మొదలైన పాయింట్ నుంచి వేల కిలోమీటర్లు జర్నీ చేసినా..ఆ జ్ఞాపకాలు పట్టి వెనక్కి లాగుతూనే ఉంటాయి. అందుకే ఈ రోజు కాసేపు ఆ జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాం. అక్కడే ఆగి ఆ క్షణాల్ని మళ్లీ ఆనందిద్దాం. ఇలా ప్రేమ చిగురించిన చోటికెళ్తే మనసులు మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇదే వాలెంటైన్ వెకేషన్. 

భరోసా గిఫ్ట్ గా..

ప్రేమలో స్వేచ్చ, స్వచ్ఛత, గౌరవం అన్నింటికన్నా ముందు ఉంటాయి. మన అభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు ఒకరి దగ్గర స్వేచ్ఛగా చెప్పుకోగలిగే ఫ్రీడమ్ ఉన్నప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. అందుకే ఈ వాలెంటైన్స్ డేకి పార్డర్ ని ఇదే గిఫ్ట్ ఇవ్వాలి. స్వేచ్ఛతో పాటు నమ్మకం, భరోసా కూడా ప్రేమకి బలమైన పునాదులు. ఇవి లేని చోట ప్రేమ ఒక్క క్షణం కూడా నిలవదు. అందుకే ఈ వాలెంటైన్స్ డేకి పార్ట్ నర్ కి స్వేచ్ఛతో పాటు నమ్మకం, భరోసా గిఫ్ట్ ఇవ్వాలి. దీనివల్ల మనసుల మధ్య దూరం తగ్గుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే..

Also Read:ఓయో రూముల్లో దొరికారా.. పెళ్లి చేస్తాం