ఆర్మూర్, బోధన్, నవీపేట్, సాలూర, వెలుగు: ఆర్మూర్, బోధన్, నవీపేట్ మండలాల్లో మాదిగ దండోరా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 ఏండ్లు అయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారం రమేశ్ అన్నారు.
మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టి 30 ఏండ్లు పూర్తి కావడంతో పాటు ఆయన 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలపై పూర్తి నమ్మకముందన్నారు.