Friendship Day 2024: ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎందుకు కట్టుకుంటారు.?

ప్రపంచంలో డబ్బు లేని వారు ఉంటారేమో కానీ స్నేహితుడు లేని వారు ఉండరు. కష్టంలో, సుఖంలో పాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ఫ్రెండ్ షిప్ డే రోజు ఎంతో ఇష్టమైన స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతారు. అసలు ఎందుకు కడతారో తెలుసా?

భారతదేశంలో ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం ( 4వ తేది)  అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ జరుపుకుంటాం. స్నేహ బంధానికి గుర్తుగా ఆరోజు అందరూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకుంటారు. అసలు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కట్టుకుంటాము? అంటే స్నేహానికి చిహ్నంగా వీటిని స్నేహితుల మణికట్టుపై కడతారు. కట్టే సమయంలో ఏదైనా కోరుకుంటే మంచి జరుగుతుందని చెబుతారు. ఇక ఆ బ్యాండ్ అరిగిపోయే వరకూ ధరించాలి. దానిని తయారు చేయడంలో పడిన కష్టాన్ని ప్రేమను కూడా గౌరవించాలి.

ఇప్పుడంటే మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ లో ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ దొరుకుతున్నాయి. నిజానికి ఒకప్పుడు వీటిని రంగు రంగుల ఊలు, లేదా దారపు పోగుతో స్వయంగా తయారు చేసి స్నేహితులకు కట్టేవారు. ఈ రంగుల వెనుక కూడా ఎన్నో అర్ధాలు ఉన్నాయి. స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆనందానికి చిహ్నంగా రంగులను సెలక్ట్ చేసుకుంటారు.