Happy Friendship Day 2024: ఇవాళ ఫ్రెండ్ షిప్ డే...

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంబంధాలలో ఒకటి స్నేహం. ఇది రక్త సంబంధాలపై మించిన బంధం.. వాగ్దానాలు, అవగాహనతో కూడిన ఆసక్తికరమైన సంబంధం. ఏం జరిగినా..స్నేహితులు మన వెన్నంటి ఉంటారు. సంతోషాలు పంచుకోవాలన్నా.. నిరాశా నిస్పృహలో ఉన్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించాలన్నా స్నేహితులే.నిజమైన స్నేహితులు వయస్సు, రంగు,కులంపై ఎటువంటి పరిమితిలేవీ చూడరు.. ఒక్కసారి స్నేహబంధం ఏర్పడితే  జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా నిలబడతారు. మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగలం.  అలాంటి స్నేహితుల గురించి ఓ ప్రత్యేక రోజుగా  ప్రతి యేటా జూలై 30 జరుపుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేక రోజున జరుపుకుంటారు. 

భారతదేశంలో ఫ్రెండ్‌షిప్ డే ఎప్పుడు?

భారతదేశంలో  ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 4  ఆదివారం, 2024న జరుపుకుంటున్నాం. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, UAE, మలేషియా, USతో సహా మరికొన్ని దేశాలు కూడా అదే రోజున స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

ఫ్రెండ్‌షిప్ డే చరిత్ర , ప్రాముఖ్యత

హాల్‌మార్క్ కార్డ్‌ల యజమాని జోస్ హాల్.. 1958లో పరాగ్వేలో మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను ప్రతిపాదించారు. అయితే 2011లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకునేంందుకు అధికారిక తేదీని ప్రకటించింది. వారు జూలై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించారు . అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు.

ఫ్రెండ్ షిప్ డే వంటి రోజు స్నేహితుల జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ స్నేహితుల  దినోత్సవం సందర్భంగా  స్నేహితులు ఒకిరికొకరు బాండ్లతో తమ స్నేహబంధాన్ని పట్టిష్టం చేసుకుంటారు. ఫ్రెండ్‌షిప్ డే వంటి రోజు మన జీవితంలో మన స్నేహితులు ఉన్నందుకు మరియు వారు మన కోసం చేసిన ప్రతిదానికీ కృతజ్ఞతలు తెలియజేయమని గుర్తుచేస్తుంది.