కామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీ నగర్​ లో ఉన్న సువార్చల సహిత హనుమాన్​ ఆలయవార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, కల్యాణ మహోత్సవం నిర్వహించారు. 

స్వామి వారి పల్లకి సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. కమిటీ ప్రతినిధులు సత్యనారాయణ గౌడ్​, బాల కిషన్​ గుప్తా, దేవాచారి, కిషన్​ గౌడ్​, నిత్యానందం, ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.