అయోధ్య రామ మందిరానికి హనుమాన్ టీం విరాళం

తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా ‘హనుమాన్’. దీనికి ప్రశాంత వర్మ డైరెక్టర్. ఈ మూవీని జనవరి11న ప్రీమియర్స్ వేశారు. అయితే, మామూలుగా ప్రీమియర్స్ అంటే కొన్ని థియేటర్స్​లో మాత్రమే వేస్తారు. కానీ, హనుమాన్ టీం ఏకంగా 300 థియేటర్లలో సినిమా ప్రీమియర్స్ వేసింది. వాళ్ల కాన్ఫిడెన్స్​కి తగ్గట్టే ప్రీమియర్స్​కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, దీనికి ముందే హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ టైంలో పెద్ద నిర్ణయం తీసుకుంది. 

అమ్ముడుపోయే ప్రతి టికెట్​లో 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళం ఇస్తామని ప్రకటించింది. అన్నమాట ప్రకారమే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో 14.25 లక్షలు విరాళం ఇచ్చింది మూవీ టీం. ఇంతటితో ఆగకుండా ఈ సినిమా ఆడినన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్​పై ఐదు రూపాయలను విరాళంగా ఇవ్వనుంది.   ​