హలో.. నేను మీ మంత్రి శీనన్నను..మీ సమస్య పరిష్కారమైందా ?

  •      దమ్మపేట తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి దరఖాస్తుదారులకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పొంగులేటి

దమ్మపేట, వెలుగు : ‘హలో.. నేను మీ మంత్రి పొంగులేటి శీనన్నను మాట్లాడుతున్నా... మీ భూమి సమస్యపై తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చారుగా.. ఆఫీసర్లు ఎలా స్పందించారు ? ఏమైనా తిప్పించుకున్నారా ?.. లంచాలు ఏమైనా అడిగారా ?’ అంటూ మంత్రి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దరఖాస్తుదారులతో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటించారు. 

ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి దమ్మపేట తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సక్సేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్టిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లను పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడారు. ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టూ ఎన్ని సార్లు తిప్పించుకున్నారు ? అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంది ? అని ఆరా తీశారు. దమ్మపేట రెవెన్యూ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అందుకే తనిఖీ చేసినట్లు చెప్పారు. వారసులు కాని వారికి పట్టా బదలాయింపులు చేయొద్దని హెచ్చరించారు.

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్లు

సంక్రాంతి నాటికి మొదటి విడతగా రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని మంత్రి చెప్పారు. నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించిన అనంతరం, ఇందిరమ్మ ఇండ్ల నమూనా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అర్హులైన ప్రతి పేదకు ఇల్లు కట్టించి ఇస్తామని స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 85 లక్షల మంది అప్లై చేసుకున్నారని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న జర్నలిస్టులకు మొదటి విడతలోనే వచ్చేలా చూస్తామన్నారు.