అవునా.. నిజమా.. పసుపుతో పొట్ట సంబంధిత ప్రాబ్లెమ్స్ వస్తాయా..?

పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో సమర్థవంతమైనదిగా పరిగణించబడుతుంది. శరీరం నుంచి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పవచ్చు. ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ వంటగదిలో కనిపించే పసుపును ప్రతి ఆహారంలోనూ ఉపయోగించడం అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకుండా పసుపు పాలు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, పీచు, ఐరన్, కాపర్, జింక్ వంటి ఎన్నో పోషకాలున్న పసుపును ఆహారంలో ఎక్కువగా వాడటం వల్ల అనేక నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? అయితే దాని వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు చూద్దాం:       

కడుపు సమస్యలు:

పసుపు కడుపుకు చాలా హానికరమైనదిగా చెప్పవచ్చు. రోజూవారి ఆహారంలో పసుపును ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తే, అది కడుపు నొప్పులు, తిమ్మిరికి కారణం కావచ్చు.

కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం:

కిడ్నీలో రాళ్లున్న రోగులకు పసుపు చాలా ప్రమాదం. ఇందులో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది, కావున ఈ వ్యాధిగ్రస్థులు పసుపు తీసుకోవడం తగ్గించుకోవడం లేదా దాన్ని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

వికారం, డయేరియా సమస్య:

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కావున మీరు పసుపును అధిక పరిమాణంలో తీసుకుంటే, వికారం, విరేచనాలతో బాధపడవచ్చు.

అలర్జీలు:

కొన్నిసార్లు పసుపు వల్ల అలర్జీ వస్తుంది. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు అలర్జీని కలిగిస్తాయి. పసుపును చర్మానికి రాసుకుంటే కొందరికి దద్దుర్లు, దురదలు మొదలవుతాయి.

డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాలి:

పసుపు మధుమేహ రోగులకు హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తం మందంగా ఉంటుంది. దీన్ని పలచబరచడానికి, మధుమేహ రోగులు మాత్రలు తీసుకోవడం సాధారణమైన విషయమే. అయితే పసుపు కూడా రక్తాన్ని పలచబరుస్తుంది. కానీ అధిక పసుపు అనేది.. రక్తం మరింత పల్చబడేలా చేసి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కావున మధుమేహ రోగులు తక్కువ పరిణామంలో పసుపు తీసుకోవడం ఉత్తమం.

అంతేకాదు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్య ఉంటే అలాంటి వారు కూడా పసుపును ఎక్కువగా తినకూడదు. పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని కారణంగా, గాయం విషయంలో రక్తం ఆగదు. అటువంటి పరిస్థితిలో సమస్య పెరుగుతుంది.