హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌లో నాన్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌) ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టులు: మొత్తం 20 పోస్టుల్లో సీఎంఎం (లెవల్-5) ఇంజినీర్‌‌‌‌‌‌‌‌: 4, మిడిల్ స్పెషలిస్ట్: 8, జూనియర్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌: 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్‌‌‌‌‌‌‌‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.500 చెల్లించాలి, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.