జిమ్‌లో ఎక్కువ వర్కౌట్లు చేస్తున్నారా ? : జాగ్రత్త.. స్పెర్మ్‌కౌంట్ తగ్గుతుందట..!

ఇటీవల కాలంలో మగవారికి సంతాన సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటివి ఎక్కువగా ఎదురవుతున్నాయి. గతంలో ఈ సమస్య కేవలం ఆడవారికే ఉంటుందనుకునేవారు. మగవారు ఈ తరహా టెస్ట్​లు చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాకపోవడంవల్ల కేవలం ఆడవారికే ఈ సమస్య ఉన్నట్లు భావించేవారు. ఫెర్టిలిటీ సమస్యలు ఇద్దరిలోనూ ఎక్కువగానే ఉంటాయట ఆరోగ్య నిపుణుల చెప్తున్నారు. వివిధ కారణాలవల్ల వంధ్యత్వం కావొచ్చని అంటున్నారు. వాటిలో ఫిట్​నెస్ కూడా ఒకటని చెప్తున్నారు. ఎందుకంటే.. 

పురుషుల్లో వంధ్యత్వ పెరుగుతున్న క్రమంలో స్పెర్మ్ కౌంట్​పై ఫిట్​నెస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై జరిపిన అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఫిట్ నెస్ కోసం ఎక్కువ వర్కౌట్లు చేసేవారికి స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పలు అధ్యాయనాల్లో తేలింది. అతిగా వ్యాయామం చేయడం సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్​లో ఎక్కువ సమయం గడిపేవారిలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు. యూకేలోని 7 జంటలపై పరిశోధన చేశారు. వారిలో ఎక్కువ సేపు ఫిట్ నెస్ కోసం వర్కౌట్లు చేసేవారిపై వంధ్యత్వం ప్రభావితం చూపింది. 

యూకేలో జరిపిన అధ్యయనంలో సంతానోత్పత్తి చికిత్స అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారు. మహిళల్లో అయితే లేట్​ ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, స్టీమ్ బాత్స్, ల్యాప్ టాప్​లు ఎక్కువగా వినియోగించడమనేది సహజకారణాలుగా మారిపోయాయట. అదే మగవారిలో జిమ్​కి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ అధ్యయనం ప్రకారం అధిక వ్యాయామం స్పెర్మ్ ఉత్పత్తికి హానికరమవుతుందని తెలిసేలా చేసింది.

ALSO READ : Health Alert: ఒక మనిషికి రోజుకు ఎన్ని కాలరీల శక్తి అవసరం..డిటెయిల్స్ ఇవే..

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం.. స్పెర్ప్ కౌంట్ ఎక్కువగా ఉన్నా.. అవి యాక్టివ్​గా లేకపోవడం వంటివి ఎక్కువైనట్లు గుర్తించారు. ఫిట్​నెస్ కోచ్​లు లేదా ఫిట్​నెస్​కి ప్రాధన్యతనిచ్చేవారు ఎక్కువగా శరీరానికి ఫిట్ గా ఉండే దుస్తులు వేసుకుంటారు. లెగ్గింగ్స్, షార్ట్స్ వేసుకుంటారు. వారానికి ఆరు రోజులు ఎక్కువ సేపు అలాంటి దుస్తులే వేసుకుంటారు. ఇలా ఎక్కువ సేపు టైట్ గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువ అవుతుందని.. ఇది ఫెర్టిలిటీ సమస్యను పెంచుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. మగవారి శరీరంలో దాదాపు హీట్ ఎక్కువగానే ఉంటుంది. రోజులో ఎక్కువగా వర్క్ అవుట్ చేయడం వల్ల మరింత హీట్ జెనరేట్ అవుతుంది. దీనితో వారు యాక్టివ్​గా ఉంటారు కానీ.. ఆ వేడికి స్పెర్మ్ కణాలు చనిపోతాయని అంటున్నారు నిపుణులు. అయితే జిమ్​కి వెళ్లడాన్ని తగ్గించి.. వదులుగా ఉండే దుస్తులు వేసుకునేవారిలో స్పెర్మ్ సంఖ్య పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. అంతేకాదు శుక్రకణాల నాణ్యత కూడా పెరిగిందని చెప్తున్నారు.